News May 17, 2024

ఇంతకు మించిన కోర్టు ధిక్కరణ ఉండదు: అమిత్‌షా

image

ఢిల్లీ CM కేజ్రీవాల్ కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారని BJP నేత, హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. నేను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు’ అని కేజ్రీవాల్ అన్నారు. దీనిపై స్పందించిన అమిత్ షా.. ఇంతకు మించి కోర్టు ధిక్కరణ ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పులిస్తుందనేదే కేజ్రీవాల్ ఉద్దేశమని ఆయన ఆరోపించారు.

Similar News

News January 9, 2025

బీజేపీ, ఆప్ మధ్యే పోటీ: కేజ్రీవాల్

image

త్వరలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో ఆమ్ ఆద్మీ పార్టీ నేరుగా తలపడుతుందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ఆప్ పోటీ చేయట్లేదని పేర్కొన్నారు. అయితే తమ పార్టీకి మద్దతు ఇస్తున్న ఇండియా కూటమి నాయకులకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.

News January 9, 2025

కాఫీ ఏ టైమ్‌లో తాగుతున్నారు?

image

రోజంతా కాకుండా కేవలం ఉదయం మాత్రమే కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయని తాజాగా చేసిన ఓ సర్వే పేర్కొంది. యూఎస్‌లోని తులనే యూనివర్సిటీలోని నిపుణుల బృందం దశాబ్దానికి పైగా చేసిన అధ్యయనంలో ఈ ఫలితాలను ప్రకటించింది. ఇతర సమయాల్లో కాఫీ తాగే వారితో పోలిస్తే ఉదయాన్నే తాగే వారిలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. సాయంత్రం కాఫీ తాగేవారిలో గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది.

News January 9, 2025

బుమ్రా బంగారు బాతు.. చంపేయొద్దు: కైఫ్

image

భారత క్రికెట్‌కు బుమ్రా బంగారు బాతు వంటి ఆటగాడని, ఆ బాతును ఎక్కువగా వాడి చంపేయకూడదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించారు. ‘బుమ్రాను కెప్టెన్‌గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. కెప్టెన్సీ భారాన్ని వేరేవారికి వదిలేసి బుమ్రా కేవలం వికెట్లు తీయడంపై దృష్టి సారించేలా చూడాలి. లేదంటే ఆ ఒత్తిడి అతడికి కొత్త గాయాలను తీసుకొచ్చి మొదటికే మోసం రావొచ్చు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.