News April 23, 2025

IND, PAK మధ్య ఇక క్రికెట్ వద్దు: మాజీ క్రికెటర్

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో PAKపై IND మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఫైరయ్యారు. అమాయకులను చంపడమే ఆ దేశ జాతీయ క్రీడగా మారిపోయిందని మండిపడ్డారు. IND, PAK మధ్య ఇక ఎప్పటికీ క్రికెట్ మ్యాచులు నిర్వహించవద్దని BCCIని కోరారు. కొన్ని నెలల క్రితం తాను పహల్‌గామ్ వెళ్లానని, అప్పుడు అక్కడ శాంతి నెలకొన్నట్లు కనిపించిందని గుర్తు చేసుకున్నారు. CT కోసం పాక్‌కు IND జట్టును BCCI పంపకపోవడాన్ని సమర్థించారు.

Similar News

News April 19, 2026

భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక మలుపు ‘ఆర్యభట్ట’

image

భారత తొలి కృత్రిమ ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను 1975లో ఇదే రోజు రష్యాలోని కాపుస్తిన్ యార్ ప్రయోగకేంద్రం నుంచి ఇస్రో చేపట్టింది. X-RAY ఖగోళ శాస్త్రం, ఏరోనమీ, సోలార్ ఫిజిక్స్‌పై ప్రయోగాలు చేసే ఉద్దేశంతో ప్రయోగించింది. 5 రోజులపాటు విజయవంతంగా పనిచేసిన ఈ శాటిలైట్ దాదాపు 17yrs తర్వాత భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఆనాడు వేసిన ఈ చిన్న అడుగే నేడు స్పేస్ రంగంలో భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపింది.

News April 19, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ఏరియాను బట్టి రూ.270 నుంచి రూ.280 వరకు అమ్ముతున్నారు. వరంగల్‌లో రూ.270, కామారెడ్డి రూ.270, ఖమ్మంలో రూ.280కి విక్రయిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో రూ.230, పల్నాడులో రూ.250-రూ.280, కర్నూలులో రూ.260, నంద్యాలలో రూ.280గా ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News April 19, 2026

MMTS రైళ్లలో ఫ్రీ జర్నీ.. జూన్ 2 నుంచి అమలు?

image

TG: HYDలో ట్రాఫిక్, పొల్యూషన్‌కు చెక్ పెట్టేందుకు MMTS రైళ్లలో ప్రయాణికులందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని JUNE 2 నుంచి ఏడాదిపాటు అమలు చేయాలని భావిస్తోంది. ఫలితాన్ని బట్టి ఆ తర్వాత కొనసాగించే ఛాన్సుంది. ఈ మేరకు ద.మ.రైల్వేకు లేఖ రాసింది. MMTS రైళ్ల ద్వారా రైల్వేకి ఏడాదికి సుమారు ₹10Cr ఆదాయం వస్తుండగా, దానిని తామే చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం.