News July 13, 2024
ఇకపై అడ్డదారిలో డ్రైవింగ్ లైసెన్స్ కుదరదు!

TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను ఆర్టీఏ కట్టుదిట్టం చేయనుంది. దీంతో ఇక నుంచి డ్రైవింగ్ టెస్టు ప్రక్రియ కంప్యూటర్‌లో రికార్డు కానుంది. డ్రైవింగ్ సరిగా చేయకపోతే కంప్యూటరే రిజెక్ట్ చేస్తుంది. అధికారులను మ్యానేజ్ చేసే అవకాశం ఉండదు. ఫెయిలైతే నెల తర్వాత టెస్టుకు రావాల్సి ఉంటుంది. కొత్త పద్ధతుల్లో 5 ట్రాకులు(H, S, మలుపులు, ఎత్తుపల్లాలు, గతుకుల K) ఉంటాయి.
Similar News
News February 9, 2025
భార్యపై కోపంతో భర్త ఏం చేశాడంటే?

ఓ వ్యక్తి భార్యపై కోపంతో ఆమె పేరుపై ఉన్న బైక్‌పై చలానాలు వచ్చేట్లు ప్రవర్తించాడు. పట్నాకు చెందిన ఓ వ్యక్తి ముజఫర్‌పూర్‌కు చెందిన యువతి పెళ్లైన నెలన్నరకే విడిపోయారు. ఆ యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ ఆమెపై కోపంతో అత్తింటి వారు ఇచ్చిన బైక్‌ను భర్త ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ నడిపాడు. బైక్ ఆమె పేరుతో ఉండటంతో చలాన్లు ఆ యువతి ఫోన్‌కు వెళ్లేవి. చలాన్లు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించారు.
News February 9, 2025
ఒంటరిగా ఉంటున్నారా?

దీర్ఘకాలిక ఒంటరితనం శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ‘ఒంటరిగా ఉంటే.. మరణించే ప్రమాదం 29% పెరుగుతుంది. రోజుకు 15 సిగరెట్లు తాగడం కంటే ఎక్కువ ప్రమాదం. గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఆందోళన పెరుగుతుంది’ అని అధ్యయనాలు చెబుతున్నాయి.
News February 9, 2025
రోహిత్ శర్మ రాణించాలని అభిమానుల పూజలు

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ తిరిగి ఫామ్ అందుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ తిరిగి పుంజుకునేలా అతనిని ఆశీర్వదించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నారు. దేవుడి దగ్గర రోహిత్ ఫొటోలు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.