News February 17, 2025

కొత్త సీఈసీ ఎంపిక ఇప్పుడే వద్దు: రాహుల్

image

కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక కోసం ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ నిర్వహించిన<<15492494>> విషయం<<>> తెలిసిందే. అయితే కొత్త CEC పేరు ప్రతిపాదనను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. సుప్రీంకోర్టులో కేసు తేలేవరకు సీఈసీ నియామకం వద్దని వారించారు. కాగా ప్రస్తుతం సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనుంది. తదుపరి సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను నియమించాలని కేంద్రం భావిస్తోంది.

Similar News

News April 12, 2026

ప్రచారంలో బ్రేక్.. IPL చూసిన సీఎం

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం స్టాలిన్ కాసేపు రిలాక్స్ అయ్యారు. కారులో వెళ్తూ ఢిల్లీ, చెన్నై మధ్య జరిగిన IPL మ్యాచ్ వీక్షించారు. ‘హై ఓల్టేజ్ ప్రచారంలో IPL బ్రేక్. సంజూ శాంసన్ సెంచరీ చేసినప్పటికీ.. నా అభిమాన క్రికెటర్ ధోనీని మిస్ అవుతున్న భావన పోవడం లేదు’ అని ట్వీట్ చేశారు. మ్యాచ్ చూస్తున్న ఫొటో షేర్ చేశారు. తమిళనాడులో ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి.

News April 12, 2026

త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ధురంధర్-2 నటుడు?

image

ధురంధర్-2 సినిమాలో రణ్‌వీర్ సింగ్ స్నేహితుడిగా కనిపించిన ఉదయ్ వీర్ సంధును టాలీవుడ్‌కు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే47’లో విలన్ పాత్రకు సంధును ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ధురంధర్-2లో సంధు కొద్దిసేపే కనిపించినా నటనతో ఆకట్టుకున్నారు. ఆయన అంతకుముందు అక్షయ్ కుమార్ ‘గోల్డ్’ మూవీలో కనిపించారు.

News April 12, 2026

చేపను ఇవ్వడం కాదు పట్టడం నేర్పాలి.. ఏమంటారు?

image

దేశంలో ఉచిత పథకాల వల్ల ప్రజలు బద్ధకస్థులు అవుతున్నారని, వాటిని రద్దు చేయాలని కొంతమంది ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం అదే మాట చెప్పారు. ‘ప్రభుత్వం ఉచితాలు రద్దు చేసి విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి. పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేసినప్పుడు వాటి బడ్జెట్ ఎంత? ఎలా నిధులు సమకూరుస్తారు? అని ప్రజలు అడగాలి’ అని ఓ కార్యక్రమంలో అన్నారు.