News February 15, 2025
జీబీఎస్ కేసులపై ఆందోళన అవసరం లేదు: మంత్రి సత్యకుమార్

AP: గిలియన్ బార్ సిండ్రోమ్(జీబీఎస్) కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ చెప్పారు. కేసులు పెరగడానికి కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. మరణాల నివారణ చర్యల కోసం ఇతర రాష్ట్రాలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయన్నారు.
Similar News
News November 25, 2025
‘వేములవాడ రాజన్నా.. నీ సొమ్ము భద్రమేనా..?’

వేములవాడ రాజన్న స్వామి దేవస్థానం సొమ్ము భద్రమేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సత్తమ్మ అనే పత్తి రైతు ఆధార్ నంబర్కు రాజన్న ఆలయ ట్రస్టు బ్యాంకు ఖాతా లింకై ఉన్నట్లు వెలుగులోకి రావడంతో ఆలయ సొమ్ము భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు వ్యక్తి ఆధార్ కార్డు ప్రభుత్వ అధీనంలో ఉండే ఆలయ ట్రస్టు ఖాతాకు అనుసంధానం కావడానికి కారణం ఏంటన్నది తేలాల్సి ఉంది. దీనిపై విచారణ చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.
News November 25, 2025
కుర్రాళ్ల ఓపికకు ‘టెస్ట్’!

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో మన కుర్రాళ్లు తేలిపోతున్నారు. ఒకప్పుడు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ రోజుల తరబడి క్రీజులో నిలబడేవారు. బౌలర్ల సహనాన్ని పరీక్షించేవారు. కానీ ఇప్పుడున్న ప్లేయర్లు పరుగులు చేయడం అటుంచితే కనీసం గంట సేపైనా ఓపికతో మైదానంలో ఉండలేకపోతున్నారు. కోహ్లీ, రోహిత్, పుజారా, రహానేల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన పంత్, నితీశ్, సుదర్శన్, జురెల్ దారుణంగా విఫలమవుతున్నారు.
News November 25, 2025
భార్య గర్భంతో ఉంటే.. భర్త ఇవి చేయకూడదట

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ‘చెట్లు నరకడం, సముద్ర స్నానం చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే క్షౌరం కూడా చేయించుకోకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చావు ఇంటికి వెళ్లడం మంచిది కాదు. శవాన్ని మోయడం అశుభంగా భావిస్తారు. గృహ ప్రవేశం, వాస్తు కర్మలు వంటివి కూడా చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తే దీర్ఘాయువు గల బిడ్డ జన్మిస్తుంది’ అని సూచిస్తున్నారు.


