News August 30, 2024
కొత్త పెన్షన్ విధానం వద్దు: ఉద్యోగ సంఘాలు
కేంద్రం ఇటీవల ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని(యూపీఎస్) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చి చెప్పాయి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)నే అమలు చేయాలని అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్(సీఎస్ఎస్) స్పష్టం చేసింది. అది తమ హక్కు అని, దాని కోసం పోరాడుతూనే ఉంటామని X వేదికగా ప్రకటించింది.
Similar News
News September 13, 2024
పోర్ట్ బ్లెయిర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే..
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ను<<14093820>> కేంద్రం శ్రీవిజయపురంగా మార్చిన<<>> సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం ఈ దీవుల్లో కాలనీలను ప్రారంభించాలని భావించింది. దానికోసం ఆర్చిబాల్డ్ బ్లెయిర్ అనే అధికారిని 1788లో తమ ప్రతినిధిగా నియమించింది. బ్రిటన్ సిబ్బంది, సేవకులతో కలిసి ఆయన ఇక్కడ నివసించేవారు. కాలక్రమంలో అతడి పేరునే రాజధానికి పోర్ట్ బ్లెయిర్‌గా పెట్టారు.
News September 13, 2024
ఫేమస్ బాడీబిల్డర్ గుండెపోటుతో మృతి
‘ప్రపంచ భయంకరమైన బాడీబిల్డర్’గా పేరొందిన ఇలియా గోలెం(36) హార్ట్ఎటాక్తో కన్నుమూశారు. ఈనెల 6న గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ 11న ప్రాణాలు కోల్పోయారు. బెలారస్‌కు చెందిన ఈ బాడీబిల్డర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అభిమానులు అతడిని ‘ది మ్యుటాంట్’ అనే నిక్‌నేమ్‌తో పిలుచుకుంటారు. 154 కేజీల బరువున్న అతడి ఎత్తు 6.1 అడుగులు. చెస్ట్ 61 అంగుళాలు కాగా బైసెప్స్ 25 ఇంచులు ఉండటం విశేషం.
News September 13, 2024
అండమాన్ దీవులకు ఆ పేరెలా వచ్చిందంటే..!
అండమాన్ దీవులకు మలయ్ జాతి ప్రజలు ఆ పేరును పెట్టినట్లు చరిత్రకారులు చెబుతారు. ఇండోనేషియాకు చెందిన మలయ్ జాతి ప్రజలు అండమాన్ గిరిజనుల్ని బంధించి బానిసలుగా విక్రయించేవారు. రామాయణంలోని హనుమాన్ పేరు మీదుగా దీవుల్ని మలయ్ ప్రజలు హండుమాన్‌గా పిలిచేవారు. కాలక్రమంలో అదే అండమాన్ అయిందని ఓ కథనం.