News August 28, 2024
జ్వరాలతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదు: మంత్రి సత్యకుమార్
AP: వర్షాకాలంలో జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా జ్వరాలతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా చూసుకోవాలన్నారు. పరిశుభ్రత, ఫాగింగ్ వంటి విషయాల్లో స్థానిక నేతల సహాయాన్ని తీసుకోవాలన్నారు. కేసులు నమోదైతే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
Similar News
News September 11, 2024
నేటి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్
AP: ఇవాళ్టి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీ శాండ్ పోర్టల్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. ఇసుక రవాణా ఛార్జీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గత ప్రభుత్వం విధించిన దానికంటే 30 నుంచి 50 శాతం ఛార్జీలు పెంచాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకే ధరలు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. 4.5 టన్నుల ఇసుక ట్రాక్టర్‌కు తొలి 10 కి.మీకు రూ.547 వసూలు చేయనున్నట్లు సమాచారం.
News September 11, 2024
పాకిస్థాన్ కాల్పులు.. BSF జవానుకు గాయాలు
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులు జరిగాయని BSF వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ ప్రాంతంలో అర్ధరాత్రి 2.35 గంటలకు సరిహద్దులో పాకిస్థాన్ కాల్పులకు తెగబడిందని తెలిపింది. దీనికి BSF జవాన్లు దీటుగా జవాబిచ్చారని, ఒక జవానుకు గాయాలు అయ్యాయని పేర్కొంది. సైనికులందరూ హై అలర్ట్‌గా ఉన్నారని వివరించింది.
News September 11, 2024
ఆధార్ అప్‌డేట్ చేసుకోండి..
ఆధార్ తీసుకుని 10ఏళ్లయిన వారు ఫ్రీగా అప్‌డేట్ చేసుకునేందుకు SEP14 వరకు గడువుంది. లేదంటే రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇంటి నుంచే UIDAI పోర్టల్‌లో ఆధార్, OTPతో లాగిన్ కావాల్సి ఉంటుంది. అయితే ఆధార్ అప్‌డేట్ చేసుకోకపోయినా అది పని చేస్తుందని UIDAI తెలిపింది. పూర్తి ప్రాసెస్ కోసం ఇక్కడ <<13946053>>క్లిక్<<>> చేయండి.