News August 20, 2024
తీర్పుల్లో సొంత అభిప్రాయాలు వద్దు: SC
కౌమార బాలికలు తమ లైంగిక వాంఛలను అదుపులో ఉంచుకోవాలని కలకత్తా హైకోర్టు 2023లో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. యువతిపై లైంగికదాడి కేసులో నిందితుడిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించగా, సుప్రీంకోర్టు శిక్షను పునరుద్ధరించింది. అంతేకాకుండా, తీర్పు కాపీలో జడ్జీలు తమ సొంత అభిప్రాయాలను రాయకూడదంటూ స్పష్టం చేసింది. నిందితుడికి నిపుణుల కమిటీ శిక్షను ఖరారు చేస్తుందని తెలిపింది.
Similar News
News September 17, 2024
భారత్vs చైనా.. నేడు ఫైనల్
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో అదరగొట్టిన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఫైనల్‌లో చైనాను ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 3.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ టెన్-1 ఛానల్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న టీమ్ ఇండియా ఐదో ట్రోఫీ సాధించాలని పట్టుదలగా ఉంది. అనూహ్యంగా ఫైనల్ చేరిన చైనా తొలి టైటిల్ కోసం ఆరాటపడుతోంది.
News September 17, 2024
గణేశ్ నిమజ్జనం.. మద్యం షాప్‌లు బంద్
TG: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో HYD వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచే మద్యం షాప్‌లు క్లోజ్ అయ్యాయి. రేపు సాయంత్రం 6 వరకు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ CV ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులిచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో మాత్రం యథావిధిగా మద్యం అందుబాటులో ఉండనుంది.
News September 17, 2024
ఇవాళ సెలవు.. నవంబర్ 9న వర్కింగ్ డే
TG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు హాలిడే వర్తిస్తుంది. అయితే వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే పలు సెలవులు వచ్చినందున నవంబర్ 9న రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు విద్యాసంస్థలు యథాతథంగా నడవనున్నాయి.