News November 14, 2024
గత ఐదేళ్లలో పైసా పెట్టుబడి రాలేదు: చంద్రబాబు

AP: వైసీపీ పాలనలో 227 ఎంవోయూలు కుదుర్చుకున్నా, ఒక్క పైసా కూడా పెట్టుబడి రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు. లైసెన్స్ రాజ్ కారణంగానే పెట్టుబడులు రాలేదని ఆరోపించారు. ‘పన్నులు, కరెంట్ ఛార్జీలు పెంచటం వల్ల పరిశ్రమలు రాలేదు. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. మేం వచ్చాక ఈజ్ డూయింగ్ విధానం అవలంభిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండేలా చేస్తాం. ఏపీని గ్లోబల్ డెస్టినేషన్గా మారుస్తాం’ అని చెప్పారు.
Similar News
News November 23, 2025
జగిత్యాలలో ప్రశాంతంగా ఎస్ఎంఎంఎస్ పరీక్షలు

జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆదివారం మొత్తం ఆరు పరీక్షా కేంద్రాల్లో ఎస్ఎంఎంఎస్ (SMMS) పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు అర్హులైన 1,474 మంది విద్యార్థుల్లో 1,416 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా, ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 23, 2025
ఆస్ట్రేలియన్ ఓపెన్లో దుమ్మురేపిన లక్ష్యసేన్

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో అద్భుత విజయం సాధించారు. జపాన్ ఆటగాడు యూషీ తనాకాపై 21-15, 21-11 తేడాతో జయకేతనం ఎగరవేశారు. దీంతో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన మూడో భారత ఆటగాడిగా లక్ష్య నిలిచారు. ఈ సీజన్లో అతనికి ఇదే తొలి BWF టైటిల్. అలాగే తన కెరీర్లో మూడో సూపర్ 500 టైటిల్.
News November 23, 2025
స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణకు హాజరుకావాలన్న స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు నేటితో గడువు ముగియనుండటంతో మరి కొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్కు లేఖ రాశారు. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు, తాజా పరిస్థితులపై కాంగ్రెస్ నేతలను ఆయన కలిసి చర్చించినట్లు సమాచారం.


