News November 14, 2024

గత ఐదేళ్లలో పైసా పెట్టుబడి రాలేదు: చంద్రబాబు

image

AP: వైసీపీ పాలనలో 227 ఎంవోయూలు కుదుర్చుకున్నా, ఒక్క పైసా కూడా పెట్టుబడి రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు. లైసెన్స్ రాజ్ కారణంగానే పెట్టుబడులు రాలేదని ఆరోపించారు. ‘పన్నులు, కరెంట్ ఛార్జీలు పెంచటం వల్ల పరిశ్రమలు రాలేదు. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. మేం వచ్చాక ఈజ్ డూయింగ్ విధానం అవలంభిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండేలా చేస్తాం. ఏపీని గ్లోబల్ డెస్టినేషన్‌గా మారుస్తాం’ అని చెప్పారు.

Similar News

News March 17, 2026

రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

image

AP: రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో పాలకవర్గం గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గం ఏర్పడే వరకు వీరే పాలన చూసుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్‌కు జులై 29, మరో 13 పురపాలికల్లో నవంబర్ 21తో గడువు ముగియనుంది. అటు పంచాయతీల్లో APR 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.

News March 17, 2026

అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు!

image

TG: గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలు అందించే బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి ఆమోదం లభించేలా చేసి, మేడే లోపు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 3-4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. HYDలో వెల్ఫేర్ బోర్డు, వారిని వ్యవస్థీకృత పరిధిలోకి తెచ్చేందుకు ప్రత్యేక సైట్, యాప్‌ను సర్కార్ సిద్ధం చేస్తోంది.

News March 17, 2026

విజయ్-రష్మిక హల్దీ వేడుకల ఫొటోలు.. వైరల్

image

గత నెలలో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక తమ హల్దీ వేడుక ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ రోజు హల్దీ+హోలీ మాదిరిగా రంగుల్లో తడిసిపోయామని రష్మిక పేర్కొన్నారు. ఇప్పటికీ తన జుట్టు ఎరుపు రంగులోనే ఉందన్నారు. అద్భుతమైన వేడుకలకు సహకరించిన సిబ్బందికి థాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.