News October 22, 2024
యాదాద్రిలో ఫొటోలు, వీడియోలు వద్దు: ఈవో

TG: యాదాద్రి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎవరూ ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడం మంచిది కాదని ఆలయ ఈవో భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేసిన ఇన్స్టా రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఈవో ఇలా స్పందించారు. ఆలయంలో ఇలా వీడియోలు తీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని ఆయన కోరారు.
Similar News
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 13, 2025
బిగ్బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్లో సంజన/భరణి/డెమోన్ పవన్లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.
News December 13, 2025
బేబీ మసాజ్కు బెస్ట్ ఆయిల్స్ ఇవే..

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.


