News October 22, 2024

యాదాద్రిలో ఫొటోలు, వీడియోలు వద్దు: ఈవో

image

TG: యాదాద్రి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎవరూ ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడం మంచిది కాదని ఆలయ ఈవో భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌రెడ్డి చేసిన ఇన్‌స్టా రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఈవో ఇలా స్పందించారు. ఆలయంలో ఇలా వీడియోలు తీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని ఆయన కోరారు.

Similar News

News November 7, 2024

ఇండియాలో IIT ఢిల్లీ టాప్

image

భారతదేశంలోని విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌‌ను QS ఆసియా విడుదలచేసింది. ఈ సంవత్సరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఢిల్లీ IIT బాంబేను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఆసియాలో 46వ స్థానంలో ఉన్న IIT ఢిల్లీ, 44వ స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాతి స్థానాల్లో IIT బాంబే, IIT మద్రాస్, IIT ఖరగ్‌పూర్, IISc బెంగళూరు, IIT కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, IIT గౌహతి, IIT రూర్కీ, JNU ఢిల్లీ ఉన్నాయి.

News November 7, 2024

ధ్రువ్ జురెల్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్

image

ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా ఏ ఆటగాడు ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. జట్టు 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడారు. 186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత కాసేపటికే భారత్ 161 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో నెసెర్ 4, వెబ్‌స్టర్ 3 వికెట్లు తీశారు.

News November 7, 2024

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

image

పసిడి కొనుగోలుదారులకు అదిరిపోయే న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.1790, 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.1650 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ.78,560కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.72,000గా నమోదైంది. ఇక వెండి ధర కిలోపై రూ.3000 తగ్గి రూ.1,02,000గా ఉంది.