News May 5, 2024
హైదరాబాద్‌ను UT చేసే ఆలోచన లేదు: కిషన్‌రెడ్డి
TG: HYDను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో BJP డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో BRSతో కలవబోమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని, ఆ పార్టీలో అంతర్గత కలహాల కారణంగా ప్రభుత్వం కూలితే తమకు సంబంధం లేదని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.
Similar News
News December 28, 2024
మెగా డీఎస్సీ ఆలస్యం.. నిరుద్యోగుల అసంతృప్తి
AP: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పలుమార్లు వాయిదా పడటంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. జూన్ నాటికి పోస్టులు భర్తీచేస్తామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంలో సాధ్యం అవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై నివేదికకు 3 నెలల గడువు ఉంది. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహణకు కనీసం 3-4 నెలలు పట్టే అవకాశం ఉంది. కొత్త టీచర్లకు శిక్షణ, పోస్టింగ్ మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది.
News December 28, 2024
న్యూ ఇయర్.. మందుబాబులకు శుభవార్త
TG: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి గంట వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా GHMC పరిధిలోని ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని సూచించింది.
News December 28, 2024
నేడు, రేపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
AP: విజయవాడ కేబీఎన్ కాలేజీ వేదికగా నేడు, రేపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ సభలను ప్రారంభించనుండగా, ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరవుతారు. 2 రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాలు జరగనున్నాయి. దేశవిదేశాల నుంచి 1,500 మందికి పైగా భాషాభిమానులు, కవులు పాల్గొంటారు.