News June 3, 2024
ఎక్కడా విద్యుత్ కోతలు లేవు: తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ‘వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ తీగలకు ఆనుకుని ఉండే చెట్ల కొమ్మలను తొలగించేందుకు, స్తంభాల మెయింటెనెన్స్ కోసం మాత్రమే విద్యుత్ నిలిపివేస్తున్నాం తప్ప కోతలు ఎక్కడా లేవు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అనవసరంగా విద్యుత్ నిలిపివేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. BRS నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించింది.
Similar News
News September 12, 2024
వర్షాకాలంలో ఆరోగ్యానికి ఏ కూరగాయలు మంచివంటే..
సీజనల్‌గా లభించేవాటిని తింటే ఆరోగ్యం బాగుంటుందంటారు పెద్దలు. మరి వర్షాకాలంలో ఏ కూరగాయలు మంచివి? న్యూట్రీషనిస్ట్ లవ్నీత్ బాత్రా 3 కూరగాయల పేర్లు చెబుతున్నారు. అవి సొరకాయ, కాకరకాయ, మునగ. ఈ మూడింటిలోనూ పుష్కలంగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కండరాల మరమ్మతులు, రోగ నిరోధక వ్యవస్థ మెరుగుదల, చర్మ సౌందర్యం, ఎముకల ఆరోగ్యం విషయాల్లో ఈ మూడూ ఉత్తమమని తెలిపారు.
News September 12, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలో వర్షాలు దాదాపు తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
News September 12, 2024
చైనాలో మరో ప్రాణాంతక వైరస్ విజృంభణ
కరోనా పుట్టిన చైనాలో మరో ప్రాణాంతక వైరస్ విస్తరిస్తోంది. దీన్ని వెట్‌ల్యాండ్ వైరస్ అని పిలుస్తున్నారు. 2019లో దీన్ని తొలిసారి గుర్తించగా, ఇప్పుడు నెలలోనే 17 మందికి సోకింది. జంతువులలో రక్తాన్నీపీల్చే పురుగుల(ఓ రకమైన నల్లులు) ద్వారా మనుషుల్లో వ్యాపిస్తోంది. వారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, దద్దుర్లు కనిపిస్తాయని, తర్వాత మెదడు, నరాల సంబంధ వ్యాధులకు కారణమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.