News November 11, 2024

కాలుష్యాన్ని ఏ మతమూ పోత్సహించదు: SC

image

కాలుష్యానికి కారణమయ్యే చర్యలను ఏ మతమూ ప్రోత్సహించదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టపాసులు కాల్చడంపై దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం ఎందుకు లేదని ప్రశ్నించింది. కాలుష్యం అనేది ఏడాదంతా సమస్యగా మారినప్పుడు కేవలం పండుగ సమయాల్లో నిషేధం విధిస్తున్నారని ఢిల్లీలో కాలుష్యంపై కేసు విచారణ సందర్భంగా కోర్టు తప్పుబట్టింది. ఫ్యాషన్‌గా టపాసులు కాలిస్తే అది ప్రాథమిక ఆరోగ్య హక్కును ప్రభావితం చేస్తుందని పేర్కొంది.

Similar News

News December 8, 2024

Australia vs India: వికెట్లు కాపాడుకుంటేనే!

image

BGT రెండో టెస్టులో టీమ్‌ఇండియా కష్టాల్లో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 29రన్స్ వెనుకంజలో ఉంది. పంత్(28), నితీశ్ రెడ్డి(15) పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ మూడో రోజు వికెట్లు కాపాడుకుంటూ ఆస్ట్రేలియాకు 250+ రన్స్ టార్గెట్ నిర్దేశిస్తేనే గెలిచే అవకాశాలున్నాయి. రెండు ఇన్నింగ్స్‌లోనూ IND టాప్‌ఆర్డర్ విఫలమైన విషయం తెలిసిందే.

News December 8, 2024

‘పుష్ప’ తరహాలో బంగాళదుంపల స్మగ్లింగ్

image

పశ్చిమ బెంగాల్‌లో బంగాళదుంపల ధరలు పెరగడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయొద్దని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. కాగా వ్యాపారులు ‘పుష్ప’ మూవీ తరహాలో వాటిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్నారు. బెంగాల్, ఝార్ఖండ్ సరిహద్దులో రెండ్రోజుల్లో పోలీసులు 20కి పైగా లారీలను సీజ్ చేశారు. వాహనాల పైభాగంలో పశువుల మేత, కింద బంగాళదుంపల బస్తాలను అమర్చి కొందరు చేస్తున్న స్మగ్లింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

News December 8, 2024

కాకినాడ పోర్టును నాశనం చేయొద్దు: ద్వారంపూడి

image

AP: రేషన్ బియ్యంతో తమ కుటుంబానికి సంబంధం లేదని, సిట్ విచారణకైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 6 నెలల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేదని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును నాశనం చేయొద్దని కోరారు. ప్రభుత్వ చర్యలతో ఎగుమతిదారులు భయపడుతున్నట్లు చెప్పారు. కేసులు ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసన్నారు.