News December 1, 2024
అశ్విన్, జడేజాకు ప్రత్యామ్నాయం లేదు: పుజారా

భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయ బౌలర్లు భారత్‌లో ఇంకా రాలేదని ఛతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డారు. ‘నేను మన దేశవాళీ టోర్నీలో ఎంతోమంది స్పిన్నర్లను చూశాను. కానీ అశ్విన్, జడ్డూని రీప్లేస్ చేయగల స్థాయి ఎవరికీ లేదు. అలాంటి ఆటగాళ్లు మళ్లీ రావాలంటే చాలాకాలం పడుతుంది. నైపుణ్యం కలిగిన యువ బౌలర్లు కొంతమంది ఉన్నారు కానీ వారికింకా చాలా అనుభవం రావాలి’ అని స్పష్టం చేశారు.
Similar News
News March 22, 2026
ఐపీఎల్‌కు బారెడు.. టెస్టులకు చారెడు!

క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు BCCI ఏటా ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంచుతోంది. ఈసారి పది మ్యాచ్‌లు పెంచి 84కి చేర్చింది. ఇది బాగానే ఉన్నా భారత్ లాంగ్ ఫార్మాట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఐపీఎల్ తర్వాత IND షెడ్యూల్‌లో 16 T20లు, 15 ODIలు ఉంటే టెస్టులు మాత్రం ఐదే ఉన్నాయి. అఫ్గాన్‌తో ఒకటి, శ్రీలంక- NZతో చెరో రెండు టెస్టులు IND ఆడనుంది. దీంతో బీసీసీఐ టెస్ట్‌లను విస్మరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News March 22, 2026
పెరగనున్న విమానాల టికెట్ల ధరలు?

యుద్ధం నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విమాన టికెట్ల ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విమాన ఇంధన(ATF) ధరలూ ఎగబాకే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏప్రిల్ 1న వీటిని సవరిస్తుంటారు. దీంతో టికెట్లపై దాని ప్రభావం ఆ రోజునే తెలుస్తుందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ ఇటీవల అన్నారు. కాగా ఇప్పటికే కొన్ని ఎయిర్‌లైన్స్ సర్‌ఛార్జ్ పేరిట ప్రయాణికులపై భారం మోపుతున్నాయి.
News March 22, 2026
SMలో నిందితుల దృశ్యాలు.. తప్పుపట్టిన సుప్రీంకోర్టు

నిందితుల ఫొటోలు, వీడియోలను ప్రజలు వెంటనే SMలో పోస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అలాగే సంకెళ్లు వేసిన, తాళ్లతో బంధించిన, మోకాళ్లపై కూర్చోబెట్టిన దృశ్యాలను పోలీసులే షేర్ చేయడం ఆ వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడమేనని పేర్కొంది. వీటి వల్ల పారదర్శక విచారణకు ముప్పు కలుగుతుందని తెలిపింది. ఇలాంటి వాటిని నియంత్రించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.


