News May 20, 2024

మత ప్రాతిపదికన మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు: జైరాం రమేశ్

image

మతం ఆధారంగా రిజర్వేషన్లు, పౌరసత్వం ఇవ్వకూడదన్న రాజ్యాంగానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మైనార్టీలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం ఆధారంగానే ఇచ్చామని పేర్కొన్నారు. బీజేపీ మత ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు.

Similar News

News December 6, 2024

పుష్ప-2 అద్భుతం.. యంగ్ హీరోల ప్రశంసలు

image

పుష్ప-2 సినిమాపై యంగ్ హీరోలు సందీప్ కిషన్, శ్రీవిష్ణు ప్రశంసలు కురిపించారు. ‘నాకు ఇష్టమైన అల్లు అర్జున్, సుకుమార్, ఫహాద్, రష్మిక, శ్రీలీల, DSP ప్రదర్శన అమోఘం. ఎక్కడ చూసినా ఇదే వైబ్ కొనసాగుతోంది’ అని సందీప్ పేర్కొన్నారు. ‘బన్నీ రప్పా రప్పా పర్‌ఫార్మెన్స్, సుకుమార్ విజినరీ డైరెక్షన్, రష్మిక, ఫహాద్ నటన అద్భుతం. మూవీ టీమ్‌కు కంగ్రాట్స్’ అని శ్రీవిష్ణు రాసుకొచ్చారు.

News December 6, 2024

నాన్ ఓపెనర్‌గా రోహిత్ శర్మ గణాంకాలివే

image

AUSతో ఇవాళ్టి నుంచి జరిగే రెండో టెస్టులో తాను ఓపెనర్‌గా <<14796317>>రావట్లేదని<<>> కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించారు. అతను గతంలో 3-5 స్థానాల్లో బ్యాటింగ్ చేసినప్పుడు రికార్డు గొప్పగా లేదు. మూడో స్థానంలో ఐదుసార్లు ఆడి 107 రన్స్, ఫోర్త్ ప్లేస్‌లో ఓ సారి కేవలం 4 పరుగులు చేశారు. ఐదో స్థానంలో 437 రన్స్, ఆరో ప్లేస్‌లో 1,037 పరుగులు సాధించారు. మరి ఈ డేనైట్ టెస్టులో ఎలా రాణిస్తారో వేచి చూడాలి.

News December 6, 2024

మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ ఎగ్జామ్స్?

image

AP: రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇంటర్ విద్యా మండలి ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. అలాగే ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను బోర్డు ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నాయి.