News December 3, 2024
లోయర్ ఆర్డర్‌లో రోహిత్ వద్దు: హర్భజన్
BGT 2వ టెస్ట్‌లో రోహిత్ శర్మ టాప్ ఆర్డర్‌లో లేదా మూడో స్థానంలో ఆడవచ్చని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. లోయర్ ఆర్డర్ 5, 6 స్థానాల్లో ఆడే అవకాశం లేదన్నారు. యశస్వీతో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేస్తారని, రాహుల్ మూడో స్థానంలో రావచ్చని పేర్కొన్నారు. ఆరో స్థానంలో రోహిత్ ఆడడం జట్టుకు మంచిది కాదని, బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్-4 ఆటగాళ్లు టీమ్‌కు 4 స్తంభాలుగా ఉండాలన్నారు.
Similar News
News January 19, 2025
నేటి నుంచి కొమురవెల్లి జాతర
TG: నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న జాతర మొదలవనుంది. 2 నెలల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నుంచి ఉగాది ముందు వచ్చే ఆదివారం వరకు ఈ జాతర జరగనుంది. ఇవాళ తొలి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు బోనాలు, పట్నాలతో స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు.
News January 19, 2025
బిహార్‌లో కూటమిగా పోటీ: రాహుల్ గాంధీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. పాట్నాలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. INDIA కూటమి ఐక్యతతో బీజేపీ, ఆరెస్సెస్‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. అంతకుముందు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లోక్‌సభ ఎన్నికల వరకే కూటమి పరిమితమని పేర్కొనగా తాజాగా రాహుల్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
News January 19, 2025
జనవరి 19: చరిత్రలో ఈరోజు
1597: ఉదయపూర్ రాజు మహారాణా ప్రతాప్ మరణం
1736: భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం
1855: ‘ది హిందూ’ పత్రిక వ్యవస్థాపకుడు జి.సుబ్రహ్మణ్య అయ్యర్ జననం
1905: భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం
1990: ప్రముఖ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం