News August 31, 2024

SMS ఔటేజ్‌ లేనట్టే: టెలికం కంపెనీలకు ట్రాయ్ ఊరట

image

టెలికం కంపెనీలకు ట్రాయ్ ఊరట కల్పించింది. సందేశాలు, కాల్‌బ్యాక్ నంబర్ల <<13931728>>వైట్‌లిస్టింగ్<<>> గడువును ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 30కి పొడగించింది. తమ సిస్టమ్స్ అప్‌డేట్ చేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా యూజర్లు సందేశాల ఔటేజ్ ఎదుర్కొనే ప్రమాదం ఉందన్న ఆపరేటర్ల మొరను ఆలకించింది. స్పామ్‌ నిరోధానికి URL, APKs, OTT లింక్స్, కాల్‌బ్యాక్ నంబర్ల సందేశాలను రిజిస్టర్ చేయాలని కంపెనీలను ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Similar News

News November 15, 2025

స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

image

స్త్రీలు గాజులు ధరించడం సాంప్రదాయమే కాదు. శాస్త్రీయంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాజులు మణికట్టుపై నిరంతరం రాపిడి కలిగిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ స్థాయి పెరుగుతుంది. గాజుల గుండ్రటి ఆకారం శక్తిని శరీరం నుంచి వెళ్లకుండా అడ్డుకుని, తిరిగి మనకే పంపుతుంది. ముఖ్యంగా స్త్రీలకు మణికట్టు వద్ద శక్తిని నిలిపి ఉంచడానికి గాజులు రక్షా కవచంగా పనిచేస్తాయి. ఇది శారీరక సమతుల్యతను కాపాడుతుంది.

News November 15, 2025

iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

image

iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. నిన్న ఫ్రాన్స్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్ కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ‘ఐబొమ్మ’ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతడి అకౌంట్లోని రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. సినిమాలను విడుదలైన రోజే పైరసీ చేసి వెబ్‌సైట్‌లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు iBommaపై కంప్లైంట్లు ఇచ్చారు.

News November 15, 2025

యాంటీబయాటిక్స్‌తో ఎర్లీ ప్యూబర్టీ

image

పుట్టిన తొలినాళ్లలో యాంటీబయోటిక్స్‌ వాడిన ఆడపిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వస్తున్నట్లు తాజా అధ్యయంలో వెల్లడైంది. దక్షిణ కొరియాకి చెందిన యూనివర్సిటీ ఆసుపత్రులు చేసిన అధ్యయనంలో ఏదైనా అనారోగ్య కారణంతో ఏడాదిలోపు- ముఖ్యంగా తొలి మూడునెలల్లో- యాంటీబయోటిక్స్‌ తీసుకున్న ఆడపిల్లల్లో 22 శాతం మంది ఎనిమిదేళ్లకంటే ముందుగానే రజస్వల అవడాన్ని గమనించారు. ఈ పరిస్థితిని సెంట్రల్‌ ప్రికాషియస్‌ ప్యుబర్టీ అంటారు.