News August 31, 2024
SMS ఔటేజ్ లేనట్టే: టెలికం కంపెనీలకు ట్రాయ్ ఊరట
టెలికం కంపెనీలకు ట్రాయ్ ఊరట కల్పించింది. సందేశాలు, కాల్‌బ్యాక్ నంబర్ల <<13931728>>వైట్‌లిస్టింగ్<<>> గడువును ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 30కి పొడగించింది. తమ సిస్టమ్స్ అప్డేట్ చేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా యూజర్లు సందేశాల ఔటేజ్ ఎదుర్కొనే ప్రమాదం ఉందన్న ఆపరేటర్ల మొరను ఆలకించింది. స్పామ్ నిరోధానికి URL, APKs, OTT లింక్స్, కాల్‌బ్యాక్ నంబర్ల సందేశాలను రిజిస్టర్ చేయాలని కంపెనీలను ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 21, 2024
సంచలనం.. SAపై అఫ్గాన్ భారీ విజయం
సౌతాఫ్రికాపై రెండో ODIలో అఫ్గాన్ 177 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో తొలిసారి ఆ జట్టుపై 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అఫ్గాన్ 311/4 స్కోర్ చేయగా, SA 34.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. రషీద్ 5, ఖరోటే 4 వికెట్లు తీశారు. బవుమా 38, జోర్జి 31, మార్క్రమ్ 21, హెండ్రిక్స్ 17 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. అఫ్గాన్ బ్యాటర్లలో గుర్బాజ్ 105, అజ్మతుల్లా 86, రహ్మత్ 50 అదరగొట్టారు.
News September 21, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 21, 2024
అమ్మో.. ఈ కార్లకు అంత ధరా..?
ఈ ఏడాది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో తొలి 2స్థానాలను రోల్స్ రాయిస్ దక్కించుకుంది. అగ్రస్థానంలో రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టెయిల్(ధర రూ.251 కోట్లకు పైమాటే), రెండో ప్లేస్‌లో బోట్ టెయిల్(రూ.234 కోట్లు), రూ.156 కోట్లతో బుగాటీ లా వోయిచర్ నోయిర్ 3వ స్థానంలో నిలిచాయి. పగానీ జోండా హెచ్‌పీ బార్చెటా(రూ.142 కోట్లు), ఎస్పీ ఆటోమోటివ్ చౌస్(రూ.120 కోట్లు) ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి.