News August 21, 2024
కూల్చివేతలపై స్టే ఇవ్వలేం: హైకోర్టు

TG: జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చివేయకుండా స్టే ఇవ్వాలంటూ దాఖలైన <<13906009>>పిటిషన్‌ను<<>> హైకోర్టు తోసిపుచ్చింది. హైడ్రా చర్యలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాను న్యాయస్థానం ఆదేశించింది. జన్వాడ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
Similar News
News November 13, 2025
పచ్చిరొట్టగా పెసర/మినుముతో సాగుకు లాభం

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.
News November 13, 2025
బిహార్‌లో SIRపై ఒక్క అప్పీల్ కూడా రాలేదు: EC

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 67.13% పోలింగ్ నమోదైనట్లు EC అధికారికంగా ప్రకటించింది. 1951 నుంచి ఇదే అత్యధికమని తెలిపింది. 38 జిల్లాల్లో ఎక్కడా రీపోల్ కోసం అప్పీల్స్ రాలేదని తెలిపింది. 7,45,26,858 మంది ఓటర్లతో తుది జాబితా రిలీజ్ చేశామని, ఎక్కడా SIRపై అప్పీల్ చేయలేదని వెల్లడించింది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుందని చెప్పింది. ఇందుకోసం 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
News November 13, 2025
ఇతిహాసాలు క్విజ్ – 65 సమాధానాలు

ప్రశ్న: దేవవ్రతుడు ఎవరు? ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది?
శంతనుడు, గంగాదేవి ఎనిమిదవ కుమారుడు ‘దేవవత్రుడు’. హస్తినాపురానికి రాజుగా కాబోనని, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భయంకరమైన ప్రతిజ్ఞ చేసినందుకు ఆయనకు ‘భీష్ముడు’ అనే పేరు వచ్చింది. శంతనుడి సంతోషం కోసం, తన తండ్రి పెళ్లి చేసుకొనే సత్యవతి పుత్రులకు రాజ్యాధికారం దక్కాలని భీష్ముడు ఈ ప్రతిజ్ఞ చేశాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


