News August 5, 2024
అలాంటి ఆప్షన్ ఏదీ లేదు: గడ్కరీ
టోల్ ఫీజుల చెల్లింపులకు వాహనదారులు నిర్ణీత దూరం (100 మీ) లేదా సమయం (10 Min) మించి ఉన్నా ఫీజు చెల్లించాల్సిందేనని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని క్లారిటీ ఇచ్చారు. NH రుసుము నియమాలు-రాయితీ ఒప్పందం ప్రకారం 60 KM (37 మైళ్లు) దూరంలో ఉన్న టోల్ ప్లాజాలకు కూడా ఫీజు వసూలు చేసే అనుమతి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News September 17, 2024
చైనాకు మద్దతు తెలిపిన పాక్ ఆటగాళ్లు
ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో చైనాకు పాక్ ఆటగాళ్లు మద్దతు తెలిపారు. పాక్ ఎవరి చేతిలో సెమీస్‌లో ఓటమిపాలైందో వారికే సపోర్ట్ చేయడం గమనార్హం. మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు చైనా జెండాలను చేతబట్టుకొని కనిపించారు. ఈ మ్యాచ్‌లో పాక్ ఎవరికి మద్దతు ఇస్తున్నది స్పష్టం అవుతోందంటూ కామెంటేటర్ వ్యాఖ్యానించారు. ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
News September 17, 2024
వినాయక నిమజ్జనంలో ప్రమాదం
మహారాష్ట్రలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు ప్రారంభానికి ముందు ట్రాక్టర్ డ్రైవర్ ఎక్కడికో వెళ్లగా.. మరో వ్యక్తి స్టార్ట్ చేశాడు. అది రివర్స్ వెళ్లి ప్రజలపైకి దూసుకెళ్లడంతో 13, 6, 3 ఏళ్ల పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వ్యక్తి, అసలైన డ్రైవర్ పారిపోగా, పోలీసులు వెతికి పట్టుకున్నారు. ధూలే జిల్లాలోని చిత్తోడ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
News September 17, 2024
మీ ఫోన్ చోరీకి గురికాకుండా ఇలా చేయండి
మీ ఫోన్ చోరీకి గురైనా కూడా దాని లైవ్ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. Track it EVEN if it is off అనే యాప్‌ను నచ్చిన ప్లాన్‌తో సబ్‌స్క్రైబ్ చేసుకొని అందులో ‘యాంటీ థెఫ్ట్’ సెలక్ట్ చేసుకొని ఫేక్ షట్‌డౌన్ ఆన్ చేసుకోవాలి. ఫోన్ చోరీకి గురైనప్పుడు ఆగంతకులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాక డివైస్ ఆఫ్ అయినట్టు కనిపిస్తుంది. కానీ, ఫోన్ ఆన్‌లోనే ఉంటుంది. యాప్ వెబ్‌సైట్ ద్వారా ఫోన్ లోకేషన్‌ను ఈజీగా ట్రాక్ చేయవచ్చు.