News September 12, 2024

రీడింగ్ గ్లాసెస్ అవసరం లేదన్న ఐడ్రాప్స్‌‌పై సస్పెన్షన్ వేటు

image

రీడింగ్ గ్లాసెస్ అవసరం ఉండదన్న <<14019427>>ప్రెస్‌వూ ఐడ్రాప్స్<<>> తయారీ లైసెన్స్‌ను DCGI సస్పెండ్ చేసింది. వారి అనాథరైజ్డ్ ప్రమోషన్ ప్రొడక్టుపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘పేషంట్లకు అది సురక్షితం కాదేమోనన్న ఆందోళన కలుగుతోంది. డాక్టర్లు మాత్రమే ఆ ఐడ్రాప్స్ సూచించాలి. ప్రమోషనేమో OTC డ్రగ్ తరహాలో చేశారు’ అని పేర్కొన్నాయి. సస్పెన్షన్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని కంపెనీ చెబుతోంది.

Similar News

News October 9, 2024

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఇలా చేయండి

image

రోజంతా చురుగ్గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలా ఉత్సాహంగా ఉండాలంటే మానసిక, శారీర ఆరోగ్యం బాగుండాలి. అందుకోసం ప్రతిరోజు కాసేపు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. టిఫిన్ స్కిప్ చేయొద్దు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. రోజూ పుష్కలంగా నీళ్లు తాగాలి. సమయానికి నిద్రపోవాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

News October 9, 2024

ఆ విద్యార్థులకు పాత సిలబస్‌తో పబ్లిక్ ఎగ్జామ్స్

image

AP: పదో తరగతి 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో చదివి ఫెయిల్ అయిన ప్రైవేట్, రీ ఎన్‌రోల్ విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు SSC పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న వారికి కొత్త సిలబస్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయన్నారు. క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు.

News October 9, 2024

FLASH: న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్

image

ఇండియాతో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముంగిట న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 16న బెంగళూరులో మొదలయ్యే టెస్టుకు కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండట్లేదని ఆ జట్టు సెలక్టర్లు ప్రకటించారు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అతడు అసౌకర్యానికి గురయ్యారు. కేన్ లేకపోవడం న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగానికి పెద్దలోటే.