News August 31, 2024

ఆ రెండు సందర్భాల్లో తీపి వద్దు

image

స్వీట్స్ అమితంగా ఇష్టపడే వారు వాటిని తినే సమయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని న్యూట్రీషియన్స్ సలహా ఇస్తున్నారు. ఉదయం లేవగానే, రాత్రి పడుకొనే ముందు శుద్ధి చేసిన చక్కెర తీసుకోవడం వల్ల హార్మోన్ల పనితీరులో అంతరాయం ఏర్పడి కచ్చితంగా బరువు పెరుగుతారని హెచ్చరిస్తున్నారు. ఈ రెండు సందర్భాల్లో తీపికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లతో రోజును ప్రారంభించవచ్చని సలహా ఇస్తున్నారు.

Similar News

News December 4, 2025

32వేల మంది టీచర్లకు ఊరట

image

పశ్చిమ బెంగాల్‌లో 32వేల మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఆ నియామకాలు చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది. 2014లో టెట్ ద్వారా టీచర్లుగా నియమితులైన అందరూ అక్రమంగా ఉద్యోగాల్లో చేరినట్లు దర్యాప్తులో తేలలేదని కోర్టు పేర్కొంది. 264 మంది మాత్రమే అలా చేరారని, వీరి కోసం 32వేల మంది రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది.

News December 4, 2025

వచ్చే నెలలో ‘భూభారతి’.. మూడు విడతల్లో ‘భూధార్’: మంత్రి పొంగులేటి

image

TG: జనవరిలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నామని, ఈ మూడింటి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందిస్తున్నామన్నారు. కొత్త సర్వే నంబర్లు, బౌండరీలు ఫిక్స్ చేసి భూధార్ కార్డులను సిద్ధం చేస్తామని చెప్పారు. మూడు విడతల్లో వీటిని అందిస్తామని పేర్కొన్నారు.

News December 4, 2025

కోసిన మిరప పంటను ఇలా ఎండబెడితే మేలు

image

పంట నుంచి కోసిన మిరపకాయలను కుప్పగా పోసి టార్పాలిన్‌తో ఒక రోజంతా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే కాయలు అన్నీ ఒకేలా పండుతాయి. తర్వాత కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రం చేసిన కాంక్రీటు కల్లాల మీద ఆరబెట్టాలి. ఇసుక లేదా పేడ అలికిన కల్లాలపై ఆరబెట్టకూడదు. రాత్రిపూట కాయలను పట్టాలతో కప్పి ఉదయం ఎండరాగానే పట్టా తీసేయాలి. మిరపలో తేమ 10-11% వరకు వచ్చేలా ఎండబెట్టాలి. లేకపోతే రంగును, మెరుపును కోల్పోయే అవకాశం ఉంది.