News August 31, 2024

ఆ రెండు సందర్భాల్లో తీపి వద్దు

image

స్వీట్స్ అమితంగా ఇష్టపడే వారు వాటిని తినే సమయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని న్యూట్రీషియన్స్ సలహా ఇస్తున్నారు. ఉదయం లేవగానే, రాత్రి పడుకొనే ముందు శుద్ధి చేసిన చక్కెర తీసుకోవడం వల్ల హార్మోన్ల పనితీరులో అంతరాయం ఏర్పడి కచ్చితంగా బరువు పెరుగుతారని హెచ్చరిస్తున్నారు. ఈ రెండు సందర్భాల్లో తీపికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లతో రోజును ప్రారంభించవచ్చని సలహా ఇస్తున్నారు.

Similar News

News September 16, 2024

మోదీ 3.0: ఈసారే జమిలి ఎన్నికలు!

image

ప్రస్తుత NDA పాలనలోనే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టితో మోదీ 3.0 పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై తన ప్రసంగంలో మోదీ జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత ఏర్పాటు చేసిన కమిటీ కేంద్రానికి నివేదిక కూడా సమర్పించింది.

News September 16, 2024

బిగ్ బాస్-8: రెండోవారం షాకింగ్ ఎలిమినేషన్

image

తెలుగు బిగ్ బాస్-8 షో ఈ సారి అంచనాలకు అందకుండా సాగుతోంది. రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారని హోస్ట్ నాగార్జున తెలిపారు. నామినేషన్స్ ఫైనల్స్‌లో ఓం ఆదిత్య, బాషా మిగలగా ఇంటి సభ్యుల ఓటింగ్‌తో అతడిని ఎలిమినేట్ చేశారు. శేఖర్ ఎలిమినేట్ కావడంతో పలువురు హౌస్ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్‌లో బాషా పంచ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

News September 16, 2024

BREAKING: రివర్స్ టెండరింగ్ విధానం రద్దు

image

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. మళ్లీ పాత టెండరింగ్ విధానాన్నే అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.