News November 24, 2024
‘నోటా’కు నో!
ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ‘నోటా’కు ఓటేయొచ్చు. 2013లో ఈసీ ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది. మొదట్లో చాలామంది నోటాకే ఓటేయగా రానురాను ఆదరణ తగ్గిపోతోంది. నిన్న వెలువడిన మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే తేలింది. MHలో నోటాకు 0.75%, ఝార్ఖండ్‌లో 1.32% ఓట్లు మాత్రమే పడ్డాయి. నోటాకు వేయడం వల్ల ఓటు వృథా అవుతోందని చాలామంది భావిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Similar News
News December 3, 2024
మహిళా వర్సిటీ బిల్లుపై త్వరలో చట్టం?
TG: మహిళా వర్సిటీ అని చెప్పి OU పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఇటీవల విద్యార్థినులు నిరసన చేపట్టారు. దీంతో చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. BRS హయాంలోనే కోఠి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీ చేస్తున్నట్లు GO జారీ చేసినా చట్టం కాలేదు. చట్టం చేసి UGC నుంచి ఆమోదం పొందితేనే వర్సిటీ పేరిట ధ్రువపత్రాలు ఇచ్చేందుకు వీలవుతుంది.
News December 3, 2024
ఆ విషయంలో ‘గేమ్ ఛేంజర్’ రికార్డు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా 2025 జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అమెరికాలోని డల్లాస్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. తాజాగా వేదిక వివరాలను మేకర్స్ వెల్లడించారు. ఈనెల 21న సాయంత్రం 6 గంటలకు Curtis Culwell Cente, గార్లాండ్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఓ ఇండియన్ సినిమా USAలో ప్రీరిలీజ్ అవ్వడం ఇదే తొలిసారని మేకర్స్ వెల్లడించారు.
News December 3, 2024
7 IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్.. విలువ రూ.12,000 కోట్లు
మరో ఏడు కంపెనీల IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఈకామ్, స్మార్ట్‌వర్క్ కోవర్కింగ్ స్పేసెస్, ట్రూఆల్ట్, జెమాలాజికల్, కెరారో, కాంకర్డ్, వెంటివ్ హాస్పిటాలిటీ ఉన్నాయి. IPOల ద్వారా సంస్థలు దాదాపు రూ.12,000 కోట్లు సమీకరించనున్నాయి. జెమాలాజికల్ అత్యధికంగా రూ.4వేల కోట్లు సమీకరించనుంది. మరోవైపు 2025లో జెప్టో పబ్లిక్ ఇష్యూకు వీలున్నట్లు కంపెనీ కో ఫౌండర్ ఆదిత్ పాలిచా వెల్లడించారు.