News July 12, 2024

ట్రంపూ వద్దు, బైడెనూ వద్దు: అమెరికన్లు

image

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ఇద్దరిపైనా ఆ దేశ ప్రజలు పెదవి విరుస్తున్నారు. బైడెనూ వద్దు.. ట్రంపూ వద్దు అంటూ సర్వేలో తేల్చిచెప్పారు. ఆ నివేదిక ప్రకారం.. ట్రంప్ వస్తే ఏమవుతుందోనని పౌరులు భయపడుతున్నారు. అటు బైడెన్‌ పట్ల సానుకూలత ఉన్నా సమర్థమైన పాలన అందించలేరన్న అభిప్రాయం వ్యక్తమైంది. భారత సంతతిలో 46శాతం మంది మాత్రమే బైడెన్‌కు ఓటేస్తామంటున్నారు. మొత్తంగా ఓటర్లు ఇద్దర్నీ రిజెక్ట్ చేస్తుండటం గమనార్హం.

Similar News

News January 30, 2026

282 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

CSI ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్‌లో 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. జిల్లా కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. TGలో 11, APలో 4 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cscspv.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News January 30, 2026

ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో పాపులర్.. ₹8,980Cr డీల్

image

టిక్‌టాక్ స్టార్ ఖబీ లేమ్ తన గ్లోబల్ బ్రాండ్‌‌(స్టెప్ డిస్టిన్‌క్టివ్ లిమిటెడ్)ని రూ.8,980 కోట్లకు రిచ్ స్పార్కిల్ అనే హాంకాంగ్ కంపెనీకి అమ్మేశారు. తన ఫేస్, వాయిస్‌తో ‘డిజిటల్ ట్విన్’ తయారు చేసి దాంతో కంటెంట్ క్రియేట్ చేస్తారు. దాని విలువ ఏడాదికి రూ.36వేల కోట్లని అంచనా. SM ప్లాట్‌ఫామ్స్‌లో ఖబీకి 238M ఫాలోవర్స్ ఉన్నారు. 2020లో మెకానిక్ జాబ్ పోయాక ఖబీ సైలెంట్ కామెడీ రియాక్షన్ వీడియోలు మొదలెట్టారు.

News January 30, 2026

పిల్లల్ని పట్టించుకుంటున్నారా?

image

ఈరోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగం, పని ఒత్తిడిలోపడి తమ చిన్నారుల కోసం సమయం కేటాయించడం లేదు. దీంతో చాలా మంది పిల్లలు తమ ఆనందాలు, బాధలు, ఒత్తిడులను తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేక డిప్రెషన్ బారిన పడుతున్నారు. అందుకే పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లల కోసం కొంత సమయం కేటాయించి వారితో మాట్లాడి వారి ఆనందాలను, బాధలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.