News July 12, 2024
ట్రంపూ వద్దు, బైడెనూ వద్దు: అమెరికన్లు

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ఇద్దరిపైనా ఆ దేశ ప్రజలు పెదవి విరుస్తున్నారు. బైడెనూ వద్దు.. ట్రంపూ వద్దు అంటూ సర్వేలో తేల్చిచెప్పారు. ఆ నివేదిక ప్రకారం.. ట్రంప్ వస్తే ఏమవుతుందోనని పౌరులు భయపడుతున్నారు. అటు బైడెన్ పట్ల సానుకూలత ఉన్నా సమర్థమైన పాలన అందించలేరన్న అభిప్రాయం వ్యక్తమైంది. భారత సంతతిలో 46శాతం మంది మాత్రమే బైడెన్‌కు ఓటేస్తామంటున్నారు. మొత్తంగా ఓటర్లు ఇద్దర్నీ రిజెక్ట్ చేస్తుండటం గమనార్హం.
Similar News
News February 19, 2025
అలాంటి వారికే పదవులు: మంత్రి లోకేశ్

AP: మంచి చేస్తున్న ప్రభుత్వంపై YCP దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని TDP శ్రేణులకు మంత్రి లోకేశ్ సూచించారు. తిరుపతి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన, పార్టీని బలోపేతం చేసేందుకు ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు అంకితభావంతో పనిచేశారో తెలుసుకుని వారికే పదవులు ఇస్తామన్నారు. ‘ఎన్నికల్లో గెలిచాం.. తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలి’ అని సూచించారు.
News February 19, 2025
ఆరంభంలోనే పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతోంది. కాగా ప్రేక్షకులు లేక కరాచీ స్టేడియం వెలవెలబోతోంది. గ్రౌండ్‌లో ఎక్కడ చూసినా ఖాళీ స్టాండ్స్ దర్శనమిస్తున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో క్రికెట్ ప్రేమికులు పాకిస్థాన్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇంత పెద్ద టోర్నీని చూసేందుకు పాక్ ఫ్యాన్స్ ఆసక్తి చూపడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
News February 19, 2025
మస్కిటో కాయిల్ ఎంత పని చేసింది!

AP: గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో <<15497063>>అగ్నిప్రమాదం ఘటనలో<<>> కీలక విషయాలు వెలుగు చూశాయి. మస్కిటో కాయిల్ వల్ల ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. బెడ్ పక్కనే కాయిల్ పెట్టుకొని విద్యార్థి పడుకోవడంతో ఫ్యాన్ వేగానికి మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ క్రమంలో పొగ గది మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. 70 మంది విద్యార్థులున్న గదికి ఒకటే ద్వారం ఉండటంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.