News November 26, 2024
మంత్రి ఇంట్లో దాడులపై అప్డేట్స్ లేవా? ఈడీని ప్రశ్నించిన కేటీఆర్

TG: భువనేశ్వర్లో జరిపిన దాడుల వివరాలను ఈడీ Xలో పోస్ట్ చేయగా, KTR స్పందించారు. ’60 రోజుల క్రితం తెలంగాణ రెవెన్యూ మంత్రి ఇల్లు, ఆఫీసుల్లో చేసిన దాడులపై అప్డేట్స్ ఏవి? ఫొటోలు/వీడియోలు ఎందుకు పోస్ట్ చేయలేదు? లోపలికి తీసుకెళ్లిన 2 కరెన్సీ కౌంటింగ్ మెషీన్స్ ఏమయ్యాయి? ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. సెప్టెంబర్లో మంత్రి పొంగులేటి ఇల్లు, ఆఫీసులో ED దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 10, 2025
రూ.5,200 కోట్లతో విశాఖలో లారస్ ల్యాబ్స్

AP: ప్రముఖ డ్రగ్ కంపెనీ లారస్ ల్యాబ్స్ విశాఖలో దాదాపు రూ.5,200 కోట్లతో అత్యాధునిక మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటుచేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం 532 ఎకరాలను కేటాయించిందని సంస్థ ఫౌండర్ చావా సత్యనారాయణ తెలిపారు. ఔషధ కంపెనీల్లో కీలకమైన ఫర్మంటేషన్ ప్లాంట్నూ ఇక్కడే ఏర్పాటుచేస్తామన్నారు. ప్రస్తుతం ఏటా రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు.
News November 10, 2025
సాహితీ శిఖరం నేలకొరిగింది: సీఎం రేవంత్

TG: అందెశ్రీ మరణంపై CM రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.
News November 10, 2025
ఐఆర్ 30 శాతం ప్రకటించాలి: PRTU

AP: హైస్కూల్ ప్లస్లలో లెక్చరర్లుగా అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటుచేయాలని, మధ్యంతర భృతి(IR) 30 శాతం ప్రకటించాలని కోరింది. అలాగే మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో హెడ్ మాస్టర్లకు ప్రత్యేక జాబ్ చార్ట్ ప్రకటించాలని APMPS HMల ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.


