News November 26, 2024

మంత్రి ఇంట్లో దాడులపై అప్‌డేట్స్ లేవా? ఈడీని ప్రశ్నించిన కేటీఆర్

image

TG: భువనేశ్వర్‌లో జరిపిన దాడుల వివరాలను ఈడీ Xలో పోస్ట్ చేయగా, KTR స్పందించారు. ’60 రోజుల క్రితం తెలంగాణ రెవెన్యూ మంత్రి ఇల్లు, ఆఫీసుల్లో చేసిన దాడులపై అప్‌డేట్స్ ఏవి? ఫొటోలు/వీడియోలు ఎందుకు పోస్ట్ చేయలేదు? లోపలికి తీసుకెళ్లిన 2 కరెన్సీ కౌంటింగ్ మెషీన్స్ ఏమయ్యాయి? ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. సెప్టెంబర్‌లో మంత్రి పొంగులేటి ఇల్లు, ఆఫీసులో ED దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Similar News

News July 6, 2025

టెస్టు చరిత్రలో తొలిసారి

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.

News July 6, 2025

పట్టు బిగించిన భారత్.. మరో 7 వికెట్లు తీస్తే..

image

ENGతో రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రాలే(0), డకెట్(25), రూట్(6) ఔటయ్యారు. ఆకాశ్‌దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే రేపు ఒక్కరోజే 536 రన్స్ చేయాలి. మరో 7 వికెట్లు తీస్తే టీమ్ ఇండియా గెలుస్తుంది. కాగా రెండో ఇన్నింగ్సులో భారత కెప్టెన్ గిల్ (161) సెంచరీతో మెరిశారు.

News July 6, 2025

ఊపిరి పీల్చుకున్న జపాన్

image

‘జపాన్ బాబా వాంగా’ <<16947282>>ర్యొ టట్సుకి<<>> జోస్యం చెప్పినట్లుగా ఇవాళ (జులై 5) జపాన్‌లో ఎలాంటి ప్రళయం సంభవించలేదు. అక్కడ 6వ తేదీ రావడంతో ఆ దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ దేశంలో చిన్న భూకంపాలు తప్ప ఎలాంటి సునామీ రాలేదు. దీంతో టట్సుకి భవిష్యవాణి నిరాధారమైందని అక్కడి మేధావులు, సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. కాగా ర్యొ టట్సుకి జోస్యంతో జపాన్‌లో ప్రళయం వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.