News August 16, 2024
పొలానికి దారి లేదా.. ఇలా చేయండి
AP: పొలానికి వెళ్లేందుకు దారి లేని రైతుల కోసం ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అలాంటి సమస్య ఉన్న రైతులు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ఈ చట్టం ద్వారా అన్నదాతలు భూమి హక్కు పొందవచ్చు. వెనుక ఉన్న పొలానికి ముందు ఉన్న పొలం రైతు దారి ఇవ్వాల్సిందే. లేదంటే సదరు రైతుపై కేసు నమోదు చేయొచ్చు. కౌలు రైతు చట్టంలోని సెక్షన్ 251 ప్రకారం పొలానికి వెళ్లేందుకు రైతులు రోడ్డు కూడా నిర్మించుకోవచ్చు.
Similar News
News September 14, 2024
VIRAL: పోలీస్ నిర్బంధంలో గణనాథుడు
పోలీస్ వ్యాన్‌లో వినాయక విగ్రహం ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటో మనసును కలిచివేస్తోందని కామెంట్స్ వస్తున్నాయి. కర్ణాటకలోని మాండ్యలో హిందువులపై దాడిని నిరసిస్తూ బెంగళూరులో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈక్రమంలోనే 40మంది ఆందోళనకారులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వినాయక విగ్రహాన్ని సైతం పోలీస్ వ్యాన్‌లోకి ఎక్కించారు. అయితే కాసేపటికే దాన్ని పోలీసులు నిమజ్జనం చేసినట్లు తెలుస్తోంది.
News September 14, 2024
తాజ్‌మహల్‌లో వాటర్ లీకేజీ!
భారత పర్యాటకానికి తలమానికమైన తాజ్‌మహల్‌లో నీరు కారుతోంది. ఆగ్రాలో గడచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన డోమ్ నుంచి నీరు లీకవుతోందని పురావస్తు అధికారులు గుర్తించారు. అయితే పెద్దగా సమస్యలేవీ కనిపించలేదని, వెంట్రుకవాసి పరిమాణంలో ఓ బీటను గుర్తించామని తెలిపారు. డ్రోన్ సాయంతో దాన్ని నిశితంగా గమనిస్తున్నామని, త్వరలోనే తగిన మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు.
News September 14, 2024
ట్రాన్స్‌జెండర్ల యూనిఫామ్స్ నమూనా ఇదే!
TG: హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ట్రాఫిక్ వాలంటీర్లుగా పని చేసే ట్రాన్స్‌జెండర్ల కోసం వేర్వేరు డిజైన్‌లతో విభిన్నమైన యూనిఫామ్స్ రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ మేరకు యూనిఫామ్స్‌కు సంబంధించిన నమూనాను రిలీజ్ చేసింది. ఈ వాలంటీర్లు నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారని ప్రభుత్వం చెప్పింది.