News June 4, 2024

గెలిచేటప్పుడు కాంగ్రెస్‌కు EVMలపై నోడౌట్స్!

image

ఓడినప్పుడే కాంగ్రెస్‌కు ఈవీఎంలపై అభ్యంతరాలు వస్తాయని బీజేపీ రాజస్థాన్ ప్రెసిడెంట్ సీపీ జోషీ విమర్శించారు. ‘కాంగ్రెస్ గెలుస్తున్నప్పుడు ఈవీఎంలపై అనుమానాలు రావు. అప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. లోక్‌సభలో మాకు స్పష్టమైన మెజార్టీ వస్తుంది. మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీయే కూటమి అధికారం చేపడుతుంది’ అని ఆయన అన్నారు. కాగా రాజస్థాన్‌లో 25 స్థానాల్లో పది చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Similar News

News January 3, 2025

స్టాలిన్ సినిమా డైలాగ్‌తో మస్క్ స్టేట్‌మెంట్ సింక్ అవుతోందట!

image

స్టాలిన్ సినిమాలో నువ్వు చేయి న‌ర‌క‌డం త‌ప్పు కాదు, కానీ న‌రికిన చోటు త‌ప్పు అని చిరంజీవిని ప్రకాశ్‌రాజ్ వారిస్తారు. అలాగే లాస్ వెగాస్‌లో టెస్లా సైబ‌ర్‌ట్రక్‌ను ముష్క‌రులు పేల్చేశారు. దీంతో నిందితులు కారును త‌ప్పుగా ఎంచుకున్నార‌ని <<15044521>>మస్క్<<>> అన్నారు. అయితే నువ్వు బాంబు పేల్చ‌డం త‌ప్పు కాదు, దాని కోసం సైబ‌ర్‌ట్ర‌క్‌ను ఉప‌యోగించ‌డమే త‌ప్పు అన్న‌ట్టుగా మ‌స్క్ స్టేట్‌మెంట్ ఉందని కామెంట్లు పేలుతున్నాయి.

News January 3, 2025

సిరియా మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం?

image

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆయన తీవ్రంగా జబ్బు పడ్డారని, భద్రతాసిబ్బంది అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. విషప్రయోగం జరిగినట్లు వైద్యులు గుర్తించారని పేర్కొన్నాయి. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించాయి.

News January 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.