News June 4, 2024
గెలిచేటప్పుడు కాంగ్రెస్‌కు EVMలపై నోడౌట్స్!
ఓడినప్పుడే కాంగ్రెస్‌కు ఈవీఎంలపై అభ్యంతరాలు వస్తాయని బీజేపీ రాజస్థాన్ ప్రెసిడెంట్ సీపీ జోషీ విమర్శించారు. ‘కాంగ్రెస్ గెలుస్తున్నప్పుడు ఈవీఎంలపై అనుమానాలు రావు. అప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. లోక్‌సభలో మాకు స్పష్టమైన మెజార్టీ వస్తుంది. మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీయే కూటమి అధికారం చేపడుతుంది’ అని ఆయన అన్నారు. కాగా రాజస్థాన్‌లో 25 స్థానాల్లో పది చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
Similar News
News November 2, 2024
త్వరలో టిడ్కో ఇళ్ల పంపిణీ: మంత్రి డోలా
AP: పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. దీపం పథకం కింద 1.43 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించామని ఒంగోలులో తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. త్వరలోనే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News November 2, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 2, 2024
BRS పదేళ్లలో చేయని అభివృద్ధిని 10 నెలల్లో చేశాం: శ్రీధర్
TG: గత ప్రభుత్వం పేదలకు కాకుండా తమ బంధువులకు, కార్యకర్తలకు గృహాలు మంజూరు చేసిందని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. తాము పేదలందరికీ ఇళ్లు ఇస్తామని, ఇప్పటికే అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ₹10L వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 50వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. పదేళ్లలో BRS చేయలేని అభివృద్ధిని తాము 10 నెలల్లోనే చేశామని తెలిపారు.