News February 28, 2025

వారికే నామినేటెడ్ పోస్టులు: రేవంత్

image

TG: ప్రభుత్వ నిర్ణయాల్లో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని స్పష్టం చేశారు. సమర్థులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పదవులు పొందిన వారు కష్టపడితే రెన్యువల్ చేస్తామని లేకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తామని తెలిపారు.

Similar News

News December 22, 2025

ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ ఆత్మహత్య

image

హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. ‘It: Chapter Two’, ‘The Black Phone’ వంటి చిత్రాలతో పాటు పలు సిరీస్‌ల్లోనూ ఆయన నటించారు. ప్రముఖ టీవీ సిరీస్ ‘The Wire’లో జిగ్గీ సోబోట్కా పాత్రతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జన్మించిన రాన్సోన్ గత కొంతకాలంగా వ్యక్తిగత, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీటి గురించి ఆయనే స్వయంగా పలుమార్లు తెలిపారు.

News December 22, 2025

100% సబ్సిడీతో ఆయిల్‌పామ్ మొక్కలు

image

AP: ఆయిల్‌పామ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తోంది. 100% సబ్సిడీతో మొక్కలు సరఫరా చేస్తోంది. హెక్టారు(2.47ఎకరాలు)కు దిగుమతి మొక్కలకు ₹29 వేలు, స్వదేశీ మొక్కలకు ₹20 వేలు ఇస్తోంది. బోర్‌వెల్‌కు ₹25 వేలు, మోటారుకు ₹10 వేలు, పంట రక్షణ కోసం వైర్ మెష్ కంపోనెంట్‌ ఏర్పాటుకు ₹20 వేలు అందజేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 2.49 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగు చేస్తున్నారు.

News December 22, 2025

ఒక్క ‘No’తో రూ.20,00,000 పోగొట్టుకుంది!

image

‘బిగ్‌బాస్9’లో టాప్2కి చేరిన నటి తనూజకు విజేత కళ్యాణ్ పడాల కంటే ఎక్కువ డబ్బు సంపాదించే ఛాన్స్ వచ్చింది. ప్రైజ్‌మనీ ₹50L నుంచి టాప్3 కంటెస్టెంట్ డెమాన్ పవన్‌ ₹15L తీసుకొని వెళ్లిపోగా ₹35L మిగిలాయి. టాప్2లో ఒకరు ₹20Lతో వెళ్లిపోవచ్చని BB ఆఫర్ చేశారు. తనూజ దాన్ని స్వీకరించి ఉంటే ₹20L వచ్చేవి. విజేతకు ₹15L మిగిలేవి. అయితే తాను 2nd ప్లేస్‌లో ఉన్నానని గ్రహించలేక తనూజ ఆఫర్ తిరస్కరిస్తూ ‘No’ చెప్పారు.