News November 29, 2024

క్రికెటేతర అథ్లెట్లకేదీ గౌరవం.?

image

ఫొటోలోని వ్యక్తి పేరు సర్వాన్ సింగ్. 1954 ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చారు. అయినా గుర్తింపు, ఉద్యోగం రాలేదు. బెంగాల్ ఇంజినీరింగ్ గ్రూప్‌ రెజిమెంట్‌లో చేరి 1970లో రిటైర్ అయ్యారు. బతుకుతెరువు కోసం గోల్డ్ మెడల్ అమ్మేసి ట్యాక్సీ కొనుక్కున్నారు. పేదరికంలోనే కన్నుమూశారు. నేటికీ క్రికెటేతర అథ్లెట్లలో చాలామందిది ఇలాంటి కథే. ఇతర క్రీడలకూ దేశంలో ప్రాధాన్యం దక్కాలన్నదానిపై మీ అభిప్రాయం?

Similar News

News January 31, 2026

కశ్మీర్‌లో ఉగ్రవాదులతో భీకర పోరు

image

JKలోని కిష్తవార్ జిల్లా దోల్గాంలో శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ మొదలైంది. జనవరి 18న మొదలైన ఆపరేషన్ త్రాషి-Iలో భాగంగా భారత ఆర్మీ, JK పోలీసులు, CRPF సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడే నక్కిన ముగ్గురు జైషే ఉగ్రవాదులు బలగాలకు తారసపడ్డారు. వారు కాల్పులు జరపటంతో.. బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

News January 31, 2026

నేటితో ముగియనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి ప్రారంభమైన ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమం నేటితో ముగియనుంది. 13,257 గ్రామాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలను అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. పాడిరైతులకు పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికీ పశువులకు టీకాలు వేయించకుంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి.

News January 31, 2026

ధనవంతులు కావాలంటే..?

image

ధనవంతులు కావాలనే తపన అందరిలో ఉంటుంది. కానీ అందుకు అదృష్టం కూడా తోడవాలి. ఆధ్యాత్మికంగా ధనాకర్షణ పెరగాలంటే తోటివారికి సాయం చేయడం, దానం చేయడం ఉత్తమం. పర్సులో ఎప్పుడూ కొంత నగదు ఉంచుకోవడం, దగ్గర డబ్బులు పెట్టడం వల్ల సంపద శక్తి పెరుగుతుంది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సానుకూలత లభిస్తుంది. అయితే, ఈ మార్గాలన్నీ ఇంజిన్‌కు పెట్రోల్ వంటివి మాత్రమే. లక్ష్యాన్ని చేరడానికి మీ నిరంతర కృషే అసలైన వాహనం.