News November 29, 2024

క్రికెటేతర అథ్లెట్లకేదీ గౌరవం.?

image

ఫొటోలోని వ్యక్తి పేరు సర్వాన్ సింగ్. 1954 ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చారు. అయినా గుర్తింపు, ఉద్యోగం రాలేదు. బెంగాల్ ఇంజినీరింగ్ గ్రూప్‌ రెజిమెంట్‌లో చేరి 1970లో రిటైర్ అయ్యారు. బతుకుతెరువు కోసం గోల్డ్ మెడల్ అమ్మేసి ట్యాక్సీ కొనుక్కున్నారు. పేదరికంలోనే కన్నుమూశారు. నేటికీ క్రికెటేతర అథ్లెట్లలో చాలామందిది ఇలాంటి కథే. ఇతర క్రీడలకూ దేశంలో ప్రాధాన్యం దక్కాలన్నదానిపై మీ అభిప్రాయం?

Similar News

News December 5, 2024

ఖజానాను ఖాళీ చేసిన జగన్: యనమల

image

AP: ప్రజా సమస్యలపై మాజీ సీఎం జగన్ <<14789250>>ఆందోళనలకు<<>> పిలుపునివ్వడంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ఆయన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఖజానాను ఖాళీ చేసిన జగన్ ప్రస్తుతం అధికారం లేకుండా ఉండలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పాలనను ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు.

News December 5, 2024

KL-జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు: రోహిత్ శర్మ

image

రేపటి నుంచి జరిగే అడిలైడ్ టెస్టులో కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారని రోహిత్ శర్మ వెల్లడించారు. తొలి టెస్టులో జైస్వాల్‌తో కలిసి KL నెలకొల్పిన భాగస్వామ్యం విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. విదేశాల్లో బ్యాటింగ్ చేసిన విధానం వల్ల అతను ఓపెనింగ్‌కు అర్హుడని చెప్పారు. తాను మధ్యలో ఎక్కడో చోట బ్యాటింగ్ చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం వ్యక్తిగతంగా తనకు కష్టమైనా జట్టుకు మంచి చేస్తుందన్నారు.

News December 5, 2024

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణ

image

AP: రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు విదేశాలకు తరలిస్తున్నారనే అంశాలపై సీఐడీ విచారణ చేయనుంది.