News February 11, 2025
ఆర్థికేతర ఫైళ్లను పెండింగ్‌లో ఉంచరాదు: సీఎం

AP: ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ఫైళ్ల క్లియరెన్సులో వేగం పెరగాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొందరు విభాగాధిపతులు ఫైళ్లను 6 నెలలు, ఏడాది వరకు తమ వద్ద ఉంచుకోవడం సరికాదన్నారు. ఆలస్యానికి గల కారణాలపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థికేతర ఫైళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచరాదని స్పష్టం చేశారు.
Similar News
News March 24, 2025
బెట్టింగ్ యాప్ కేసు.. నేడు విచారణకు యాంకర్ శ్యామల

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ సెలబ్రిటీల విచారణ కొనసాగుతోంది. ఇవాళ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. తనపై నమోదైన FIRను కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా శ్యామలను అరెస్ట్ చేయొద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని ఆమెకు సూచించింది. అటు ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించిన పోలీసులు రేపు మరోసారి ఎంక్వైరీ చేయనున్నారు.
News March 24, 2025
నేటి పాలకులు బ్రిటిష్ వారి కంటే అధ్వానం: కేజ్రీవాల్

భగత్ సింగ్, అంబేడ్కర్ వారసత్వాన్ని బీజేపీ విస్మరిస్తోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆప్ ప్రధాన కార్యాలయంలో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేటి పాలకులు బ్రిటిష్ వారి కంటే అధ్వానంగా ఉన్నారని BJPపై విమర్శలు చేశారు. భగత్ సింగ్, అంబేడ్కర్ కలలను నెరవేర్చడానికే తాము రాజకీయాల్లోకి వచ్చామని, అధికారం కోసం కాదని వ్యాఖ్యానించారు.
News March 24, 2025
ఉగాదిలోపు రాష్ట్రానికి కొత్త కమల దళపతి!

TG: BJP కొత్త రాష్ట్రాధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉగాదిలోపు ఏ క్షణంలోనైనా ఈ ప్రకటన ఉండొచ్చని ముఖ్య నేతలు చెబుతున్నారు. నిన్న కిషన్ రెడ్డి హుటాహుటిన హస్తినకు వెళ్లడమూ ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికే BJP MLAలు, MPలతో పాటు పలువురు సీనియర్ల అభిప్రాయాలను అధిష్ఠానం సేకరించింది. రేసులో బండి సంజయ్, రాంచందర్ రావు, లక్ష్మణ్, అర్వింద్, DK అరుణ, ఈటల, పాయల శంకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.