News February 5, 2025
TTDలో అన్యమత ఉద్యోగులు బదిలీ
AP: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై టీటీడీ క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. ఇకపై వీరిని టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధులకు నియమించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 18 మందిని వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Similar News
News February 5, 2025
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సా.6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.
News February 5, 2025
తండ్రి అయ్యేందుకు 11వేల కి.మీలు ప్రయాణం
దక్షిణ చిలీలోని ‘పార్క్ టంటాకో’ అటవీ ప్రాంతాల్లో ఉండే డార్విన్స్ కప్పలకు ప్రాణాంతక కైట్రిడ్ ఫంగస్ సోకినట్లు 2023లో గుర్తించారు. దీంతో ఈ జాతి అంతరించిపోకుండా ఉండేందుకు చేపట్టిన ఎమర్జెన్సీ మిషన్లో మగ కప్పలను యూకేకు తరలించారు. దీనికోసం బోటు, విమానం, కారులో ఇలా 11వేల కి.మీలకు పైగా ప్రయాణించాయి. ఎట్టకేలకు ఈ అసాధారణ విధానం ద్వారా యూకేలో 33 పిల్లలు జన్మనిచ్చాయి. ఇవి 2గ్రాముల కంటే తక్కువ బరువుంటాయి.
News February 5, 2025
విడదల రజినీపై కేసుకు హైకోర్టు ఆదేశం
AP: మాజీ మంత్రి విడదల రజినీపై 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు వివరాలను తమకు పంపాలని పేర్కొంది. 2019లో రజినీని ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిల్లి కోటి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు రజినీపై కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.