News May 4, 2024
ఆగని లేఆఫ్‌లు.. తలలు పట్టుకుంటున్న టెకీలు

ఐటీ, టెక్, స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 80 వేల మంది ఉద్యోగాలు పోగా.. ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మంది ఇంటి బాట పట్టారు. దిగ్గజ కంపెనీలు యాపిల్, అమెజాన్, ఇంటెల్ వందల మందిని పక్కనపెట్టాయి. ఆర్థిక కారణాలతో బైజూస్ 500 మందిని తొలగించగా.. టెస్లా ప్రపంచ వ్యాప్తంగా తమ ఉద్యోగుల్లోని 10 శాతం మందికి పింక్ స్లిప్ ఇచ్చింది.
Similar News
News December 12, 2025
చిన్నస్వామిలో IPL మ్యాచ్‌లకు లైన్ క్లియర్!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ IPL మ్యాచ్‌లు నిర్వహించేందుకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జస్టిస్ డీకున్హా కమిషన్ సూచించిన భద్రతా సిఫార్సులు అమలు చేస్తే మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక క్యాబినెట్ నిర్ణయించింది. తొక్కిసలాట ఘటన అనంతరం స్టేడియం భద్రతాపరంగా అనుకూలం కాదని నివేదిక తేల్చడంతో పెద్ద ఈవెంట్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం స్టేడియం పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.
News December 12, 2025
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు
News December 12, 2025
అఖండ-2.. AICCకి షర్మిల ఫిర్యాదు!

అఖండ-2 టికెట్ ధరల పెంపు <<18532497>>వివాదం<<>> ఢిల్లీని తాకినట్లు తెలుస్తోంది. CM చంద్రబాబు చెబితేనే CM రేవంత్ రేట్లు పెంచారంటూ APCC చీఫ్ షర్మిల AICCకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాము CBNకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చెప్పింది చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే విషయమై INC పెద్దలు ఆరా తీసి TG ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు టాక్. దీంతో ఇకపై టికెట్ ధరలు పెంచబోమంటూ మంత్రి కోమటిరెడ్డి <<18543073>>ప్రకటించినట్లు<<>> సమాచారం.


