News September 10, 2024

సాయంత్రంలోగా సాధారణ పరిస్థితులు నెలకొనాలి: సీఎం

image

AP: విజయవాడలో ఇవాళ సాయంత్రం వరకు సాధారణ స్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా అక్కడి ప్రాంతాల్లో తిరుగుతూ సమీక్షలు నిర్వహించాలని, ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆ ప్రాంత మంత్రులకు సూచించారు. ముంపు ప్రాంతాలకు చెందిన 2.75లక్షల మందికి సహాయక చర్యలు అందించాలన్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చారు.

Similar News

News October 4, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న మంత్రి సురేఖ
* సురేఖపై పరువునష్టం దావా వేసిన నాగార్జున
* సురేఖ వ్యాఖ్యలను ఖండించిన చిరు, ఎన్టీఆర్, మహేశ్, నాని
* కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ హడావుడి: రేవంత్
* జగన్ లడ్డూ అపవిత్రం చేశారని మేం చెప్పలేదు: పవన్
* కేసులకు YCP శ్రేణులు భయపడొద్దు: జగన్
* PM-RKVY స్కీమ్‌కు కేంద్రం రూ.లక్ష కోట్ల మంజూరు

News October 4, 2024

ఒక్కో కార్మికుడికి ₹1.92 ల‌క్ష‌ల జీతం, ₹16,515 బోన‌స్‌

image

పాలస్తీనా, లెబనాన్, ఇరాన్‌తో యుద్ధాల వల్ల ఇజ్రాయెల్‌లో ఏర్ప‌డిన కార్మికుల కొర‌త భార‌తీయుల‌కు కాసుల పంట కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌లో ప‌నిచేయ‌డానికి భార‌త ప్ర‌భుత్వం ద్వారా ఎంపికైన స్కిల్డ్ వర్కర్స్‌కు నెలకు ₹1.92 ల‌క్ష‌ల జీతం, ₹16,515 బోన‌స్‌, వైద్య బీమా, వ‌స‌తి ల‌భిస్తోంది. ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్నా స‌రే భార‌తీయులు అక్క‌డ ప‌నిచేయ‌డానికి క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టిదాకా 11 వేల మందిని ఎంపిక చేశారు.

News October 4, 2024

ఈ నెల 14న‌ హ్యుందాయ్ IPO

image

దేశీయ స్టాక్ మార్కెట్లోనే ₹25,000 కోట్ల అతిపెద్ద‌ హ్యుందాయ్ IPO అక్టోబ‌ర్ 14న ప్రారంభంకానున్న‌ట్టు తెలుస్తోంది. సెబీకి దాఖలు చేసిన కంపెనీ DRHP ప్రకారం సంస్థ‌ భారతీయ విభాగం కంపెనీ, ప్ర‌మోట‌ర్ల ద్వారా 142,194,700 ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS)ని ప్రతిపాదించింది. ఈ IPOతో మారుతీ సుజుకి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా గత 20 ఏళ్లలో ప్రజలకు షేర్లు ఆఫర్ చేస్తున్న మొదటి కార్ల తయారీ సంస్థగా అవతరించనుంది.