News July 4, 2024
వరదలతో ఈశాన్యం అతలాకుతలం

నదులు ఉగ్రరూపం దాల్చడంతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వరస వరదలతో వణికిపోతున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్లో నదుల నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. అస్సాంలో వరదలకు 8మంది బలయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 16 లక్షలమంది తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చైనా, భూటాన్, అరుణాచల్‌లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలే దీనికి కారణమని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
Similar News
News November 27, 2025
అమరావతిలో రూ.1,328 కోట్ల పెట్టుబడులు.. 6,541 ఉద్యోగాలు

ఈ నెల 28న అమరావతిలోని సీఆర్డిఏ కార్యాలయం వద్ద 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయ పనులకు శంకుస్థాపన జరగనుంది. 15 బ్యాంకుల ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు, 6,541 ఉద్యోగాల కల్పన అమరావతిలో జరగనుందని CRDA కమిషనర్ కె. కన్నబాబు IAS బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాబార్డ్, ఆప్కాబ్, ఎల్ఐసీ, NIACLతో పాటు 11 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉద్ధండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెంలో ఏర్పాటు కానున్నాయన్నారు.
News November 27, 2025
చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్

ఇండియన్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. తాజా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో స్వర్ణం గెలిచారు నిఖత్. పారిస్ ఒలింపిక్స్ తర్వాత విరామం తీసుకున్న నిఖత్, తిరిగి రింగ్‌లో అడుగుపెట్టి తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసింది. దాదాపు 21 నెలల తర్వాత అంతర్జాతీయ వేదికపై నిఖత్ పతకం సాధించడం విశేషం. ఈ మెడల్ భారత మహిళా బాక్సింగ్‌లో మరో మైలురాయిగా నిలిచింది.
News November 27, 2025
గంభీర్‌పై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం ఉండదు: BCCI

తన భవిష్యత్తుపై బీసీసీఐదే <<18393677>>నిర్ణయమన్న<<>> టీమ్ ఇండియా కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై బోర్డు స్పందించింది. ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఓ అధికారి వెల్లడించినట్లు NDTV పేర్కొంది. ప్రస్తుతం జట్టు మార్పుల దశలో ఉందని ఆయన తెలిపారు. అయితే కోచ్ మార్పు ఉండదని బీసీసీఐ స్పష్టమైన సంకేతాలిచ్చింది. కాగా భారత్ వరుస టెస్ట్ సిరీస్‌ల ఓటమి నేపథ్యంలో గంభీర్‌ను తొలగించాలంటూ డిమాండ్లు వచ్చాయి.


