News February 6, 2025
87 మద్యం షాపులకు ఒక్క దరఖాస్తూ లేదు
AP: కల్లు గీత కులాలకు ప్రభుత్వం ప్రకటించిన మద్యం షాపుల పాలసీకి స్పందన కరువైంది. 339 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే నిన్నటికి 730 దరఖాస్తులే వచ్చాయి. అందులో 87 షాపులకు ఒక్కరు కూడా అప్లై చేయలేదు. దీంతో ఎక్సైజ్ వర్గాలు షాకయ్యాయి. ప్రభుత్వం 10% మార్జిన్ మాత్రమే ఇస్తుండటం, ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. కాగా దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు పొడిగించారు.
Similar News
News February 6, 2025
అజిత్ ‘పట్టుదల’ పబ్లిక్ టాక్
అజిత్, త్రిష కాంబినేషన్లో తెరకెక్కిన ‘విదాముయార్చి’(పట్టుదల) మూవీ ప్రీమియర్ షోలు యూఎస్‌లో మొదలయ్యాయి. ఈ యాక్షన్ సినిమా ఫస్టాఫ్ స్లోగా మొదలైనా ట్విస్టులు, కమర్షియల్ ఎలిమెంట్లు బాగున్నాయని పలువురు పోస్టులు చేస్తున్నారు. అజిత్ నటన, అనిరుధ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. కొన్ని సీన్లలో దర్శకుడు కాస్త తడబడినట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
News February 6, 2025
ఇవాళ జగన్ ప్రెస్ మీట్
AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
News February 6, 2025
నాటోకు జెలెన్‌స్కీ అల్టిమేటం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నాటో, పశ్చిమ దేశాలకు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. తమకు అణ్వాయుధాలో లేక నాటోలో సభ్యత్వమో ఏదొకటి త్వరగా తేల్చాలని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘ఓవైపు రష్యా మాపై దూకుడు పెంచుతుంటే మాకెందుకు నాటో సభ్యత్వం ఇవ్వడం లేదు? ఇప్పట్లో నాటో సభ్యత్వం ఇచ్చే ఆలోచన లేకపోతే వెంటనే అణ్వాయుధ క్షిపణుల్నైనా మాకు ఇవ్వాలి. మమ్మల్ని మేం రక్షించుకునేదెలా?’ అని ప్రశ్నించారు.