News August 30, 2024
రూ.లక్ష కోట్లతో లక్ష ఎకరాలు కూడా పండించలేదు: మంత్రి ఉత్తమ్
TG: రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు కూడా సేద్యంలోకి రాకపోవడం సిగ్గు చేటని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. BRS సర్కారు కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని, రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఫైరయ్యారు. మార్చి 2026 నాటికి దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
Similar News
News September 19, 2024
ఆ సంస్థ ఉద్యోగులకు ఇండియా హెడ్ మెయిల్
పనిఒత్తిడి కారణంగా 26 ఏళ్ల CA మృతి చెందిన ఘటనపై EY సంస్థ India ఛైర్మన్ రాజీవ్ మేమాని ఉద్యోగులకు పంపిన మెయిల్ వెలుగులోకొచ్చింది. సంస్థలో బాధితురాలి ప్రయాణం తక్కువ కాలంలోనే ముగిసిందని, ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులు తనకు రాసిన లేఖను సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్యకరమైన, సమతుల్య పని వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
News September 19, 2024
అశ్విన్ ఫైటింగ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 339/6 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (102) సెంచరీతో చెలరేగారు. రవీంద్ర జడేజా (86) సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (56) అర్ధ సెంచరీతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మొహమూద్ 4, రానా, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
News September 19, 2024
కొత్త స్టడీ: రోజూ 3 కప్పుల కాఫీతో లాభాలు
ప్రతిరోజూ మూడు కప్పుల కాఫీ/టీ తాగడం వల్ల గుండె, జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. చైనాలోని సూచౌ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ చౌఫు కే బృందం 1.80 లక్షల మందిపై అధ్యయనం జరిపింది. మితంగా తీసుకొనే కెఫిన్ (3 కప్పుల కాఫీ/టీ) కార్డియోమెటబోలిక్ మల్టీమోర్బిడిటీ, కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో సాయపడుతుందని వెల్లడించింది.