News November 4, 2024
ప్రతి న్యూడ్ పెయింటింగ్ అశ్లీలం కాదు: బాంబే HC
ప్రతి నగ్న పెయింటింగ్ అశ్లీలమైనది కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రఖ్యాత భారతీయ కళాకారులు ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా, అక్బర్ పదమ్‌సీల 7 చిత్రాలను విడుదల చేయాలని కస్టమ్స్ అధికారులను ఆదేశించింది. ‘అసభ్యకరం’ అనే కారణంతో ఆ కళాకృతులను జప్తు చేసిన అధికారులను హెచ్చరించింది. మైఖేలాంజెలో చెక్కిన నగ్న శిల్పం ఇండియాలోకి వచ్చినపుడు దానికి బట్టలు వేయాలని ఇండియన్ కస్టమ్స్ చట్టాలు చెప్పలేదని గుర్తు చేసింది.
Similar News
News December 2, 2024
నేడే ‘సైబర్ మండే’.. అంటే ఏమిటి?
ఈకామర్స్ సైట్లలో ఇవాళ సైబర్ మండే సేల్ నడుస్తోంది. అమెరికాలో నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్ డే’ ఉంటుంది. ఆరోజు వ్యాపారులు భారీ ఆఫర్లు ఇస్తుంటారు. దీనికి పోటీగా ఆన్‌లైన్ షాపింగ్ పెంచేందుకు ఈ-రిటైలర్లు 2005లో ‘సైబర్ మండే’ ఆఫర్ సేల్ ప్రకటించారు. థ్యాంక్స్ గివింగ్ డే తర్వాతి సోమవారం ఇది ఉంటుంది (ఈసారి DEC 2). USA నుంచి ఇతర దేశాలకు పాకిన ఈ స్ట్రాటజీ ఇప్పుడు భారత్‌నూ తాకింది.
News December 2, 2024
లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా
పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్, ఛైర్మన్ సముదాయించినా విపక్ష ఎంపీలు వినలేదు. అదానీ అంశంపై చర్చకు కేంద్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలను స్పీకర్, ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు.
News December 2, 2024
హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో కీర్తి సురేశ్ పెళ్లి!
టాలీవుడ్ ‘మహానటి’ కీర్తి సురేశ్ & ఆంటోనీల వివాహం గోవాలో ఈనెల 12న జరగనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు వివాహం జరగనుండగా, 10న ప్రీవెడ్డింగ్, 11న సంగీత్ నిర్వహించనున్నారు. 12న ఉదయం కీర్తి మెడలో ఆంటోనీ తాళి కట్టనుండగా అదేరోజు సాయంత్రం స్థానిక చర్చిలో మరోసారి వెడ్డింగ్ జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నారు.