News March 18, 2024
క్రాంగెస్‌లో చేరడానికి గొర్రెల్లో ఒకడిని కాదు: RSP
TG: తాను కేసీఆర్‌తో కలిసి పని చేయడంపై CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై RS ప్రవీణ్ కుమార్ స్పందించారు. తెలంగాణ ప్రజలకు ఏ పార్టీలో చేరాలనే విషయంలో స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ‘మీరు గేట్లు తెరిస్తే చాలామంది పిరికిపందలు, అసమర్థులు, స్వార్థపరులు గొర్రెల మందలా వస్తున్నారు. ఆ గొర్రెల మందలో నేను లేను. ప్రవీణ్ కుమార్ నిజమైన, నిస్వార్థ, నిఖార్సైన వ్యక్తి’ అని RSP అన్నారు.
Similar News
News September 10, 2024
వారిపై దేశద్రోహం కింద కేసులు పెడతాం: హోంమంత్రి
AP: ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపై విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయని హోంమంత్రి అనిత తెలిపారు. ‘బోట్ల ఘటనపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. ఇది మానవ చర్యే. బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయి. కావాలనే వాటిని కొట్టుకువచ్చేలా చేశారు. అవి తలశిల రఘురాం, నందిగం సురేశ్ బంధువులకు చెందినవిగా గుర్తించాం. విచారణలో తేలితే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. దేశద్రోహం కింద కేసులు పెడతాం’ అని అన్నారు.
News September 10, 2024
దులీప్ ట్రోఫీ జట్లలో మార్పులు
దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌లో పాల్గొన్న పలువురు ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టుల కోసం జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. దీంతో రెండో రౌండ్ కోసం ఇండియా-C మినహా మిగతా 3 జట్లలో బీసీసీఐ మార్పులు చేసింది. ఇండియా-A కెప్టెన్‌గా గిల్ స్థానంలో మయాంక్‌ను నియమించింది. జైస్వాల్, పంత్ స్థానంలో ఇండియా-Bకి రింకూ సింగ్, ప్రభుదేశాయ్‌ను, అక్షర్ పటేల్ స్థానంలో ఇండియా-Dకి నిషాంత్ సింధును సెలక్ట్ చేసింది. జట్ల పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News September 10, 2024
LPGతో వంట ఖర్చు 5 రూపాయలే: కేంద్ర మంత్రి
పీఎం ఉజ్వల స్కీమ్‌లో ప్రతిరోజూ వంటకయ్యే ఖర్చు రూ.5 అని పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పురి అన్నారు. ఆ స్కీమ్‌లో లేనివాళ్లకు రూ.12 అవుతుందన్నారు. ‘గతంలో గ్రామాల్లో స్వచ్ఛ వంట ఇంధనం పరిమితంగా లభించేది. 2014లో 14 కోట్లున్న LPG కనెక్షన్లు 2024కు 33 కోట్లకు పెరిగాయి. సిలిండర్ ధరలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. నన్నడిగితే వారి హయాంలో అసలు సిలిండర్లే లేవంటాను’ అని పేర్కొన్నారు.