News December 8, 2024

పాన్ ఇండియా కాదు.. తెలుగు ఇండియా: ఆర్జీవీ

image

దేశంలోని థియేటర్లలో ‘పుష్ప-2’ హవా కొనసాగుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌పై పరోక్షంగా దర్శకుడు ఆర్జీవీ సెటైర్లు వేశారు. ‘బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిందీ ఫిల్మ్‌గా డబ్బింగ్ చిత్రం ‘పుష్ప-2’ నిలిచింది. బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద హిందీ నటుడు ఆ భాష మాట్లాడలేని తెలుగు యాక్టర్ అల్లు అర్జున్. ఇకపై పాన్ ఇండియా కాదు. ఇది తెలుగు ఇండియా’ అని తనదైన స్టైల్‌లో Xలో రాసుకొచ్చారు.

Similar News

News January 26, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 26, 2025

శుభ ముహూర్తం (26-01-2025)

image

✒ తిథి: బహుళ ద్వాదశి రా.7.17 వరకు
✒ నక్షత్రం: జ్యేష్ట ఉదయం 7.08 గంటల వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1) సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: సా.3.30-5.09 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.34-3.13 వరకు

News January 26, 2025

వందేళ్ల వయసులో ఆమెకు పద్మశ్రీ

image

గోవా స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారు లిబియా లోబో సర్దేశాయ్. ఓ క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో 1924లో జన్మించిన ఆమె, పోర్చుగీసు పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించారు. వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్(Voz da Liberdade) పేరిట అక్కడ 1955లో ఓ భూగర్భ రేడియో కేంద్రాన్ని నడిపి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. గోవాను భారత్‌లో కలిపేందుకు అప్పట్లో ప్రాణత్యాగానికి సైతం ఆమె సిద్ధం కావడం గమనార్హం.