News March 29, 2024

పాడేరులో సీనియర్లను కాదని..

image

AP: అల్లూరి జిల్లా పాడేరులో సీనియర్ నేతలను కాదని కిల్లు వెంకటరమేశ్‌కి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయన పాడేరు మాజీ సర్పంచ్ వెంకటరత్నం కుమారుడు. టీచర్‌గా రాజీనామా చేసి ఇటీవల TDPలో చేరారు. ఈ సీటు కోసం Ex MLA గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణికుమారి, ZP మాజీ ఛైర్‌పర్సన్ కాంతమ్మ, నాగరాజు ప్రయత్నించారు. కాగా ఇక్కడ చివరిగా 1999లో టీడీపీ గెలిచింది. మరి కొత్త అభ్యర్థి రాకతో ఇక్కడ TDP జెండా ఎగురుతుందేమో చూడాలి.

Similar News

News January 19, 2026

రికార్డు స్థాయిలో పడిపోయిన చైనా జనాభా

image

చైనాలో వరుసగా నాలుగో ఏడాదీ జనాభా క్షీణించింది. 2025లో 33.9 లక్షలు తగ్గి 140.5 కోట్లకు చేరింది. జననాల రేటు 5.63గా నమోదై రికార్డుస్థాయికి పడిపోయింది. మరణాల రేటు మాత్రం 8.04తో 1968 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది. యువత పెళ్లిళ్లపై విముఖత చూపడం, పెరిగిన జీవనవ్యయం వల్ల దంపతులు పిల్లలు వద్దనుకోవడం ఇందుకు కారణాలు. ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా, ‘ముగ్గురు పిల్లల’ విధానం తెచ్చినా మార్పు రాలేదు.

News January 19, 2026

హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు… అప్లై చేశారా?

image

హైదరాబాద్‌లోని <>ECIL<<>>లో 4 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. BE/BTech 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై, పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్, షార్ట్ లిస్టింగ్, DV, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. ఏడాదికి రూ.5వేలు జీతం పెంచుతారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in

News January 19, 2026

గొర్రె, మేక పిల్లల పెరుగుదలకు సూచనలు

image

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.