News October 6, 2024
ఈ విషయాన్ని గమనించారా?
మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా LTE, VoLTE అనే గుర్తును నెట్‌వర్క్ బార్ పక్కన చూసుంటారు. అయితే, అలా ఎందుకు ఉందో చాలా మందికి తెలియదు. VoLTE అంటే వాయిస్ ఓవర్ లాంగ్-టర్మ్ ఎవల్యూషన్. మెరుగైన కాలింగ్ ఫీచర్, వాయిస్& డేటాను ఏకకాలంలో ఉపయోగించే సామర్థ్యాన్ని ఇది అందిస్తుంది. HD వాయిస్, వీడియో కాలింగ్, రిచ్ కాల్ సర్వీస్‌ల వంటి మెరుగైన కాలింగ్ ఫీచర్‌లు పొందవచ్చు. ఇది 2011లో అందుబాటులోకి వచ్చింది.
Similar News
News November 4, 2024
BREAKING: టెట్ ఫలితాలు విడుదల
AP: గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. <
News November 4, 2024
రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు రాష్ట్రానికి రానున్నారు. సా.4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, విద్యావేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈ సమావేశానికి దాదాపు 400 మందికి ఆహ్వానం అందినట్లు సమాచారం.
News November 4, 2024
GREAT: ₹5000 నుంచి ₹50,000 కోట్లకు..
యంగ్ ఆంత్రప్రెన్యూర్స్‌కు Waree టెక్నాలజీ ఛైర్మన్ హితేశ్ చిమన్‌లాల్ ఆదర్శనీయం. కిరాణాకొట్టు యజమాని కొడుకైన ఆయన చదువుకుంటున్నప్పుడే 1985లో బంధువుల దగ్గర రూ.5000 అప్పు తీసుకొని జర్నీ ఆరంభించారు. 1989లో వ్యాపారం విస్తరించి తొలి ఏడాదిలో రూ.12వేల టర్నోవర్ సాధించారు. కట్‌చేస్తే 40ఏళ్ల తర్వాత కంపెనీ మార్కెట్ విలువ రూ.71,244 కోట్లకు చేరింది. IPOకు రావడంతో ఆయన కుటుంబ నెట్‌వర్త్ రూ.50వేల కోట్లను తాకింది.