News January 2, 2025
ఫార్ములా ఈ-రేస్ కేసులో అధికారులకు మళ్లీ నోటీసులు
TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో అధికారులకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 8, 9 తేదీల్లో తప్పకుండా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా ఇవాళ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరు కాలేదు. తమకు మరింత సమయం కావాలని వారు ఈడీని కోరారు. దీంతో ఈ నెల 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 7న కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Similar News
News January 22, 2025
జనవరి 22: చరిత్రలో ఈ రోజు
1882: స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం
1918: కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటు
1940: తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి మరణం
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
1972: సినీ నటి నమ్రత జననం
1989: సినీ నటుడు నాగశౌర్య జననం
2014: తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు(ఫొటోలో) మరణం
News January 22, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 22, 2025
దావోస్‌లో ప్రభుత్వం కీలక ఒప్పందాలు
TG: దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. మేఘా ఇంజినీరింగ్, ప్రభుత్వం మధ్య మూడు ఒప్పందాలు జరిగాయి. 2,160 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం రూ.11వేల కోట్లతో ఒప్పందం జరిగింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కోసం మరో రూ.3వేల కోట్లు, అనంతగిరిలో ప్రపంచ స్థాయి లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు కోసం రూ.1000 కోట్లతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.