News February 22, 2025
ఏడున్నర లక్షల మందికి నోటీసులు

TG: ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని వారిపై కఠిన చర్యలకు GHMC శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 6 లక్షల మంది భవన యజమానులకు, ట్రేడ్ లైసెన్స్ తీసుకోని, రెన్యువల్ చేసుకోని మరో లక్షన్నర మందికి నోటీసులు జారీ చేసింది. మార్చి నెలాఖరుకు రూ.600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా అడుగులు వస్తోంది. మొండి బకాయిలున్న 100 హోటళ్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, భవనాలను ఇప్పటికే సీజ్ చేసింది.
Similar News
News March 15, 2025
ఎన్నికల కోసమే డీఎంకే హిందీ డ్రామా: కిషన్ రెడ్డి

TG: తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, అందుకే డీఎంకే పార్టీ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. త్రిభాషా పాలసీ కొత్తదేం కాదని, దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని స్పష్టం చేశారు. తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పైనా డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
News March 15, 2025
ఆయుర్దాయం పెరగాలంటే ఇలా చేయండి!

ఫ్యామిలీతో కలిసి ఎక్కువకాలం బతకాలని అందరూ కోరుకుంటారు. ఇది సాధ్యం కావాలంటే కొన్ని పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. కడుపులో 80 శాతం నిండినంత వరకే తినాలి. టీవీ, ఫోన్ చూడకుండా నెమ్మదిగా కింద కూర్చునే తినాలి. హెర్బల్ టీ తాగాలి. రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. సమీపంలోని ప్రదేశాలకు నడక ద్వారానే వెళ్లాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకుని వ్యాధులను గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
News March 15, 2025
వాళ్లే జనసేన MLAలు: అంబటి రాంబాబు

AP: తన సిద్ధాంతం ఏంటో తెలియని స్థితిలో Dy.CM పవన్ ఉన్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ‘పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్‌రేట్ అని మాట్లాడుతున్నారు. గెలిచిన వారిలో అసలైన జనసేన నేతలు ఎంతమంది? YCP టికెట్ రాని, చంద్రబాబు మనుషులే జనసేన MLAలు. 2 పార్టీలు వాపును చూసి బలం అనుకుంటున్నాయి. జనసేన MLAలు దోపిడీ చేస్తుంటే పవన్ చుక్కలు లెక్కబెడుతున్నారు’ అని విమర్శించారు.